తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్‌డేట్స్‌: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విస్తరణ కొనసాగుతోంది. ఇటు తెలంగాణలో కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 943కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్‌డేట్స్‌: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..!
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 9:33 AM

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విస్తరణ కొనసాగుతోంది. ఇటు తెలంగాణలో కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 943కు చేరింది. హైదరాబాద్‌లో 495 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వలన రాష్ట్రంలో 24మంది మరణించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాల క్వారంటైన్ వ్యవధిని 28 రోజులకు పెంచింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.

అటు ఏపీలో కరోనా విస్తరణ రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా కర్నూల్‌, గుంటూరు జిల్లాల్లో వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 60 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 821కు చేరింది. రాష్ట్రంలో కరోనాతలో మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. వీరిలో అత్యధికంగా 8 మంది గుంటూరు జిల్లాలో ఉన్నారు.

Read This Story Also: కరోనా విలయతాండవం.. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కేసులు..!