లాక్ డౌన్ బేఖాతర్.. గుంపుగా పార్టీ చేసుకున్న గ్రామ వాలంటీర్లు..

విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక పంచాయతీకి చెందిన 11 మంది గ్రామ వాలంటీర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

లాక్ డౌన్ బేఖాతర్.. గుంపుగా పార్టీ చేసుకున్న గ్రామ వాలంటీర్లు..
Follow us

|

Updated on: Apr 23, 2020 | 2:09 PM

కరోనా కష్టకాలంలో ఏపీలోని గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ అనుమానితులను గుర్తించడంతో పాటు.. గ్రామాల్లోని ప్రజల్లో వైరస్‌పై అవగాహన కల్పించడంతో సహా పలు కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పని చేస్తున్నారు. అయితే కొంతమంది గ్రామ వాలంటీర్లు మాత్రం లాక్ డౌన్ రూల్స్ బేఖాతర్ చేస్తూ.. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక పంచాయతీకి చెందిన 11 మంది గ్రామ వాలంటీర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఏటికొప్పాక పంచాయతీకి చెందిన వాలంటీర్ తోటాడ కుమార్ తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం తోటి వాలంటీర్లకు స్థానిక మామిడి తోటలో విందు ఏర్పాటు చేశాడు. దీనికి సహచర వాలంటీర్లు హాజరవ్వగా.. అందులో ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు. అంతేకాక సామాజిక దూరాన్ని పాటించకుండా గుంపులుగా కూర్చుని విందు ఆరగించారు. అనంతరం వారందరూ కాసేపు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక అదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రూరల్ ఎస్ఐ వీరిపై కేసు నమోదు చేశారు.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ అగ్రస్థానం..

లాక్ డౌన్ వేళ.. అదిరిపోయే పబ్జీ కాంపిటీషన్.. ప్రో-ప్లేయర్స్ గెట్ రెడీ..