ఇటలీలో అల్లకల్లోలం.. 10 వేలు దాటిన కరోనా మరణాలు..

| Edited By:

Mar 29, 2020 | 7:35 AM

కరోనా వైరస్ ఇటలీలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏం జరుగుతుందిలే అనే కేర్‌లెసే ఇప్పుడు ఇటలీ ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. ఈ వైరస్ చైనాలో పురుడుపోసుకున్నా.. దాన్ని కట్టడి చేసి.. అద్భుతమైన విజయాన్ని సాధించారు చైనీయులు. కానీ ఇప్పుడు ఇటలీలో పరిస్థితి దారుణంగా..

ఇటలీలో అల్లకల్లోలం.. 10 వేలు దాటిన కరోనా మరణాలు..
Follow us on

కరోనా వైరస్ ఇటలీలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏం జరుగుతుందిలే అనే కేర్‌లెసే ఇప్పుడు ఇటలీ ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. ఈ వైరస్ చైనాలో పురుడుపోసుకున్నా.. దాన్ని కట్టడి చేసి.. అద్భుతమైన విజయాన్ని సాధించారు చైనీయులు. కానీ ఇప్పుడు ఇటలీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ దేశ ప్రధానే కన్నీళ్లు పెట్టుకున్నారంటే.. అక్కడ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ ఆ దేశంలో ఏకంగా కరోనా మరణాలు 10 వేలు దాటియి. అంతే కాకుండా రోజు రోజుకీ.. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి.

తాజాగా ఇటలీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 92,472కి చేరింది. శనివారం అక్కడ కొత్తగా 5,974 మంది కరోనా బారిన పడ్డారు. శనివారం ఒక్కరోజే ఇటలీలో 889 మంది చనిపోవడంతో.. మృతుల సంఖ్య 10,023కి చేరింది. కాగా ప్రపంచంలోనే ఇటలీలోనే కరోనాతో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి.

కాగా.. ప్రజలు కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారా.. లేక కరోనా వరస్ మరింత బలంగా వ్యాపిస్తోందా.. తెలీడం లేదు కానీ ఆలోచిస్తే రెండూ జరుగుతాయన్న సమాధానం వస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందర్నీ భయపెడతూ.. ప్రళయ తాండవం సృష్టిస్తోంది కరోనా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 30 వేలకి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. అలాగే 6,60,0064 కేసులు నమోదు కాగా.. వీరిలో 14,1422 మంది కోలుకున్నారు.

ఇవి కూడా చదవండి: కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్

ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ

కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్

కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి

కరోనా ఎఫెక్ట్.. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టులుగా టమాటాలు..

కరోనా ఎఫెక్ట్: తన వల్ల ఊరికి ఏమీ కాకూడదని వృద్ధుడు ఆత్మహత్య

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన