ఇటలీలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు.. స్పందించిన కేటీఆర్
ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లి తిరిగి భారత్‌కు వస్తున్న విద్యార్థులపై కరోనా ఎఫెక్ట్ పడింది. దేశం కానీ దేశంలో బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. ఇప్పటికిప్పుడు కరోనా మెడికల్ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ..
ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లి తిరిగి భారత్‌కు వస్తున్న విద్యార్థులపై కరోనా ఎఫెక్ట్ పడింది. దేశం కానీ దేశంలో బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. ఇప్పటికిప్పుడు కరోనా మెడికల్ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు విద్యార్థులు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని, తెలంగాణ ప్రభుత్వమే తమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థులు. ఇందుకు సంబంధించిన వీడియో మెసేజ్‌లను టీవీ9కి పంపించారు విద్యార్థులు.
కాగా ఈ విషయంపై స్పందించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. విదేశాంగ మంత్రి జయ శంకర్‌తో పాటు ఇండియన్ ఇటలీ ఎంబసీకి ఇటలీ ఎయిర్ పోర్టులో ఇరుక్కున్న విద్యార్థుల వీడియోను ఆయన ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఇటలీలోని జెనోవా రోమ్ ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ విద్యార్థులు చిక్కుకున్నారు. కరోనా భయంతో ఎయిర్‌పోర్ట్‌లో విద్యార్థులను నిలిపివేశారు ఇటలీ అధికారులు. తమకు సహాయం చేయండి అంటూ టీవీ9కు వీడియో సందేశం పంపించారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ విద్యార్థులతో పాటు కేరళ, కర్నాటక, నాగపూర్ విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలిపారు. ఎమ్‌ఎస్ పూర్తి చేసిన తాము తిరిగి వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఆపేశారని అంటున్నారు. అయితే మెడికల్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే ఫ్లయిట్‌లో అనుమతి ఇస్తామని అధికారులు అంటున్నారట! మరోవైపు ఇటలీలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 631 మంది మరణించారు.
Request Hon’ble EAM @DrSJaishankar Ji to direct Indian embassy officials @IndiainItaly and help the stranded Indians https://t.co/LR4pEcNjRD
— KTR (@KTRTRS) March 12, 2020
Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..
లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..
హీరో, హీరోయిన్‌కు కరోనా.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ
మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు