వింగ్స్ ఇండియా షో కు కరోనా ఎఫెక్ట్…
రెండేళ్లకు ఒకసారి బేగంపేట విమానాశ్రయంలో జరిగే వింగ్స్ ఇండియా షో కు కరోనా వైరస్ భయం పట్టుకుంది. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు ఈ షో జరగనుంది. ఇక ఏవీయేషన్ షో సందర్భంగా ..
రెండేళ్లకు ఒకసారి బేగంపేట విమానాశ్రయంలో జరిగే వింగ్స్ ఇండియా షో కు కరోనా వైరస్ భయం పట్టుకుంది. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు ఈ షో జరగనుంది. ఇక ఏవీయేషన్ షో సందర్భంగా పదుల సంఖ్యలో విమానాలు, అంతకు పదిరెట్లకు పైగా ఎగ్జిబిటర్లు, వేలాది మంది సందర్శకులు, అక్రోబాట్ విన్యాసాలతో ఏవియేషన్ షోలో పాల్గొంటారు..అయితే, ప్రతీయేటా వ్యాపార సందర్శకులకు మొదటి రెండు రోజులు కేటాయించినా,.. చివరి రెండు రోజులు సాధారణ సందర్శకులకు కేటాయిస్తుంటారు. కాగా, ఈ సారి వింగ్స్ ఇండియా షోను కరోనా కలవరపెడుతోంది. దీంతో ఈ సారి వ్యాపార సంబంధిత ప్రతినిధులను రూ.2500 టిక్కెట్‌తో మాత్రమే అనుమతించనున్నారు.
రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి పౌర విమానయాన అంతర్జాతీయ ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలోనే ఈ ఏడాది కూడా ఈ ప్రదర్శన కొనసాగుతోంది.. ఇందుకు గాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు అధికారులు. ఇతర రాష్ట్రాలు, దేశాలలో కొవిడ్ వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ పౌరవిమానయాన ప్రదర్శన ప్రాంగణంలో నివారణ, అవగాహన ఏర్పాట్లను భారీగానే చేయబోతున్నట్లు నిర్వాహక సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. యాక్సెస్ పాయింట్ల వద్ద టెంపరేచర్ స్కీనింగ్ పరికరాలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరీక్షించడానికి డాక్టర్ల బృందం అందుబాటులో ఉంచడంతో పాటుగా హ్యాండ్ శానిటైజర్లను సైతం ఉంచామని, నో కాంటాక్ట్ పాలసీని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరో వైపు, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, సాధారణ సందర్శకులను అనుమతించడం లేదని నిర్వాహకులు తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌ఐసీసీఐ), మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. గతంలో ఉదయం, సాయంత్ర వేళల్లో 20 నిముషాల పాటు నిర్వహించే విమానాల విన్యాసాల సమయాన్ని ఈసారి గంట సేపటికి పొడిగించారు.