హీరో, హీరోయిన్‌కు కరోనా.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ

ప్రస్తుతం కరోనా వైరస్ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనాను మహమ్మారిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇప్పుడు ఈ వైరస్ ఓ సినీ దంపతులకు..

హీరో, హీరోయిన్‌కు కరోనా.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 12, 2020 | 11:17 AM

ప్రస్తుతం కరోనా వైరస్ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనాను మహమ్మారిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇప్పుడు ఈ వైరస్ ఓ సినీ దంపతులకు కూడా సోకింది. ఆస్కార్ విజేత, హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్, అతని భార్య నటి రిటా విల్సన్ ఇద్దరికీ కరోనా వైరస్ పాజిటీవ్‌ అని తేలింది. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్ట్రేలియాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఓ సినిమా నిర్మాణం కోసం ఆస్ట్రేలియా వెళ్లారు ఈ దంపతులు. గత కొద్ది రోజులుగా జ్వరంగా.. అలసటగా ఉండటంతో.. పరీక్షలు చేయించుకున్న వీరికి కరోనా ఉందని తేలింది. ప్రస్తుతం వీరు ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు.

కాగా ఈ విషయం తెలిసి.. హాలీవుడ్ చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది. ఇప్పటికే అమెరికాలో ఈ వైరస్ వల్ల 38 మంది చనిపోగా.. టామ్ సినీ దంపతులకు సోకడం దిగ్భ్రాంతికి గురి చేసింది. మరోవైపు కరోనా వైరస్ ప్రబలడంతో తన షోను వాయిదా వేసుకున్నానని సింగర్ సీలైన్ డియాన్ ప్రకటించింది.

Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు