డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…

ఒక వైపు రాష్ట్రంలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే.. మరోవైపు సంక్షేమ పధకాలను అమలు చేస్తూ ఏపీ సర్కార్ ప్రజలను ఆదుకుంటోంది. రాష్ట్రంలోని 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు లబ్ది చేకూరేలా సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన జీరో వడ్డీ పధకాన్ని పునః ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా పొదుపు సంఘాల మహిళలకు సుమారు రూ. 1,400 కోట్ల మేరకు లబ్ది చేకూరనుంది. […]

డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్...
Follow us

|

Updated on: Apr 20, 2020 | 2:56 PM

ఒక వైపు రాష్ట్రంలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే.. మరోవైపు సంక్షేమ పధకాలను అమలు చేస్తూ ఏపీ సర్కార్ ప్రజలను ఆదుకుంటోంది. రాష్ట్రంలోని 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు లబ్ది చేకూరేలా సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన జీరో వడ్డీ పధకాన్ని పునః ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా పొదుపు సంఘాల మహిళలకు సుమారు రూ. 1,400 కోట్ల మేరకు లబ్ది చేకూరనుంది. కాగా, ఈ పధకం 2016లో ఆగిపోయిన సంగతి తెలిసిందే.

ఈ పధకం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని 6.95 లక్షల సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.975 కోట్ల సాయం అందనుండగా.. పట్టణ ప్రాంతాల్లోని 1.83 లక్షల సంఘాలకు రూ.425 కోట్ల చొప్పున జీరో వడ్డీ పధకంతో లబ్ధి చేకూరుతుంది. ఇక పధకానికి సంబంధించిన విధివిధానాలు సోమవారం, లేదా మంగళవారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అటు పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి జీరో వడ్డీ పధకం అమలుకు గానూ రూ.765.19 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

లాక్ డౌన్ సడలింపులు.. నేటి నుంచి వీటికి అనుమతి…

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..

అత్యవసర ప్రయాణాల కోసం ఈ-పాస్‌లు.. తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం..