అత్యవసర ప్రయాణాలకు ఈ-పాస్‌లు.. తెలంగాణ ప్రభుత్వం సంచలనం..

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసిఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకూ ఉన్నా.. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇస్తామని కేంద్రం చెప్పింది. కానీ తెలంగాణలో మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని కేసిఆర్ స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర, ముఖ్యమైన పనుల కోసం […]

  • Updated On - 2:55 pm, Mon, 20 April 20
అత్యవసర ప్రయాణాలకు ఈ-పాస్‌లు.. తెలంగాణ ప్రభుత్వం సంచలనం..

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసిఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకూ ఉన్నా.. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇస్తామని కేంద్రం చెప్పింది. కానీ తెలంగాణలో మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని కేసిఆర్ స్పష్టం చేశారు.

ఈ నేపధ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర, ముఖ్యమైన పనుల కోసం అనుమతులు ఇచ్చేందుకు ఈ- పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీని కోసం పోలీస్ శాఖ తమ వెబ్‌సైట్‌లో ఒక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు పోలీస్ కమీషనర్ అంజని కుమార్ మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ పాస్‌లను ప్రత్యేక టీమ్ రివ్యూ చేస్తుందని.. ఒకవేళ ఎవరైనా వాటిని దుర్వినియోగం చేస్తే వెంటనే క్యాన్సిల్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలను హెచ్చరించారు.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

లాక్ డౌన్ సడలింపులు.. నేటి నుంచి వీటికి అనుమతి…

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..