కరోనా వైరస్.. రంగంలోకి ఇస్రో.. ఏం చేస్తుందో తెలుసా..!
కరోనా వైరస్‌పై భారత ప్రభుత్వం చేస్తోన్న యుద్ధానికి మద్దతుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రంగంలోకి దిగింది. కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో తేలిగ్గా ఆపరేట్ చేసే విధంగా

కరోనా వైరస్‌పై భారత ప్రభుత్వం చేస్తోన్న యుద్ధానికి మద్దతుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రంగంలోకి దిగింది. కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో తేలిగ్గా ఆపరేట్ చేసే విధంగా ఉండే వెంటిలేటర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు, మాస్కుల తయారీకి తమ వంతు తోడ్పాటును అందించనుంది. ఈ విషయాన్ని ఇస్రో డైరక్టర్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. విక్రమ్ సారాభాయ్ సెంటర్‌లో వెంటలేటర్ డిజైన్‌ను మాత్రమే ఇస్తామని.. దాని తయారీ బాధ్యతలు పరిశ్రమలే తీసుకోవాలని ఆయన అన్నారు.
తమ సిబ్బంది ఇప్పటికే 1000లీటర్ల శానిటైజర్లను తయారు చేసిందని ఆయన వివరించారు. అంతేకాదు మాస్కులను కూడా తయారు చేస్తున్నారని సోమ్‌నాథ్ తెలిపారు. ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఎవ్వరు కరోనా బారిన పడలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా కరోనా నేపథ్యంలో రాకెట్ల తయారీని ఆపేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 ప్రయోగానికి సంబంధించిన రాకెట్లను కూడా లాంచ్‌పాడ్స్ నుంచి అసెంబ్లింగ్ భవనానికి తీసుకొచ్చినట్లు సమాచారం.
Read This Story Also: శ్రీవారి పూజలపై రూమర్లు.. పెద్ద జీయంగార్ స్వామి ఏమన్నారంటే..!



