సింగర్‌కు నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో ఫ్యామిలీ..!

కరోనాకు గురైన బాలీవుడ్ సింగర్‌కు నాలుగోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తుండగా.. సింగర్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 10 రోజుల నుంచి ఆమెకు చికిత్స అందిస్తున్నప్పటికీ.. ఎలాంటి మార్పు లేకపోవడం తమను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని సింగర్ కుటుంబసభ్యుల్లో ఒకరు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఎక్కడైనా తరలించాలనుకున్నా.. విమాన సర్వీసులు నిలిచిపోయాయని వారు […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:56 pm, Sun, 29 March 20
సింగర్‌కు నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో ఫ్యామిలీ..!

కరోనాకు గురైన బాలీవుడ్ సింగర్‌కు నాలుగోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తుండగా.. సింగర్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 10 రోజుల నుంచి ఆమెకు చికిత్స అందిస్తున్నప్పటికీ.. ఎలాంటి మార్పు లేకపోవడం తమను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని సింగర్ కుటుంబసభ్యుల్లో ఒకరు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఎక్కడైనా తరలించాలనుకున్నా.. విమాన సర్వీసులు నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆమె కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థించడం ఒక్కటే తాము చేయగలిగిన పని అని వారు చెబుతున్నారు. మరోవైపు వైద్యులు మాట్లాడుతూ.. కనిక పరిస్థితి నిలకడగానే ఉందని అంటున్నారు. కాగా ఇటీవల లండన్‌కు వెళ్లి వచ్చిన సింగర్‌కు కరోనా సోకినట్లు వెల్లడి కావడంతో కలకలం రేగింది. మరోవైపు భారత్‌కు వచ్చిన తరువాత ఆమె ఓ విందుకు హాజరుకాగా.. అందులో పాల్గొన్న ప్రముఖులు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పాటించనందుకు.. కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమెపై కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనా వైరస్‌.. రంగంలోకి ఇస్రో.. ఏం చేస్తుందో తెలుసా..!