శ్రీవారి పూజలపై రూమర్లు.. పెద్ద జీయంగార్ స్వామి ఏమన్నారంటే..!

శ్రీవారి ఆలయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని పెద్ద జీయంగార్ స్వామి ఖండించారు. స్వామివారి ఆలయంలో కైంకర్యాలు త్వరగా చేయమని ఒత్తిడి చేస్తున్నారని,

శ్రీవారి పూజలపై రూమర్లు.. పెద్ద జీయంగార్ స్వామి ఏమన్నారంటే..!
Follow us

| Edited By:

Updated on: Mar 29, 2020 | 5:40 PM

శ్రీవారి ఆలయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని పెద్ద జీయంగార్ స్వామి ఖండించారు. స్వామివారి ఆలయంలో కైంకర్యాలు త్వరగా చేయమని ఒత్తిడి చేస్తున్నారని, స్వామివారికి ప్రసాదాలు తక్కువగా నివేదన చేస్తున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శ్రీవారి సన్నిధిలో అఖండ దీపాలు కొండెక్కాయని, ఆలయంలో కొన్ని అపచారాలు జరుగుతున్నాయంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ స్వామి వారి సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకూ అన్ని కైంకర్యాలు నిర్దేశించిన సమయానికే జరుపుతున్నామని ఆయన అన్నారు.  స్వామివారి కైంకర్యాలు త్వరగా ముగించాలని తమ మీద ఎలాంటి ఒత్తిడి లేదని.. గర్భాలయంలో అఖండ దీపాలను ఏకాంగులు జాగ్రత్తగా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. స్వామివారి ఆలయంపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మొద్దని ఈ సందర్బంగా పెద్ద జీయంగార్ స్వామి వెల్లడించారు.

Read This Story Also: HBD Nithiin: అదరగొట్టేస్తోన్న నితిన్ ‘రంగ్‌దే’ మోషన్ పోస్టర్..!