Coronavirus: కరోనా నివారించేందుకు అదే అత్యుత్తమ మార్గంః కేంద్రం

కరోనా వైరస్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్‌ చాలా శక్తివంతమైందని.. గాలి ద్వారా వ్యాపించకపోయినా, రోగి తుంపర్ల ద్వారా వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపింది.

Coronavirus: కరోనా నివారించేందుకు అదే అత్యుత్తమ మార్గంః కేంద్రం
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2020 | 5:21 PM

కరోనా వైరస్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్‌ చాలా శక్తివంతమైందని.. గాలి ద్వారా వ్యాపించకపోయినా, రోగి తుంపర్ల ద్వారా వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపింది. వైరస్ సోకిన తర్వాత టెస్టులో నెగెటివ్ వచ్చినా, ఐదారు రోజుల తర్వాత పాజిటివ్ కావొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 80శాతం మందికి ఈ వైరస్ సోకినా ఏమీ తెలియకపోవచ్చునని తెలిపింది. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు వచ్చి ఆ తర్వాత తగ్గిపోతుందని.. 20 శాతం మందిలో మాత్రమే దగ్గు, జలుబు, జ్వరం విపరీతంగా ఉండొచ్చునని పేర్కొంది. ఇందులో 5 శాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఏర్పడుతుందని.. అందుకు తగ్గట్టుగా భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపింది. ప్రతివారంలో 60-70వేల టెస్టులు చేయగలిగే సామర్థ్యం మనకు ఉందని వెల్లడించింది.

ఇంతకు ముందు ఒకటే వైరస్ ల్యాబ్ ఉండేదని.. ఇప్పుడు 110 ల్యాబులు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ప్రైవేట్ రంగంలో కూడా ల్యాబ్ ల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే ఇష్టానుసారంగా కరోనా టెస్టులు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఐసోలేషన్‌లో ఉండడమే కరోరాను నివారించడానికి అత్యుత్తమ మార్గమమని సూచించింది. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. మార్చి 31వరకు స్కూళ్లు, మాళ్లతో పాటు రైళ్లు కూడా బంద్ కానున్నాయి. అలాగే వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 75జిల్లాలను లాక్‌ డౌన్ చేస్తున్నట్లు కూడా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఒకేరోజు మూడు మరణాలు.. దేశంలో ‘కరోనా’ ముదురుతోందా..!

తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..