జనతా కర్ఫ్యూ: ఆవకాయ పచ్చడి కలుపుతున్న నాగశౌర్య
'జనతా కర్ఫ్యూ' ప్రకటించిన నేపథ్యంలో దేశం మొత్తం ఇళ్లకే పరిమితమైంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఇంట్లోనే వివిధ రకాల పనులు చేస్తూ కాలం గడుపుతున్నారు. టాలీవుడ్ హీరో నాగశౌర్య, తన అమ్మ దగ్గర ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో..

‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించిన నేపథ్యంలో దేశం మొత్తం ఇళ్లకే పరిమితమైంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఇంట్లోనే వివిధ రకాల పనులు చేస్తూ కాలం గడుపుతున్నారు. కానీ టాలీవుడ్ హీరో నాగశౌర్య.. మాత్రం పాత పద్దతులవైపు మొగ్గుచూపారు. తన అమ్మ దగ్గర ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఆమె దగ్గర కూర్చొని తయారీ విధానం చెబుతుండగా.. శౌర్య ఆవకాయ కలుపుతూ ఉన్న.. వీడియోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు. కాగా.. ఇటీవలే ‘అశ్వద్థామ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగశౌర్య. ప్రస్తుతం సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మాణంలో లక్ష్మీ అనే కొత్త దర్శకురాలు తీస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. కాగా తాజాగా కరోనా ఎఫెక్ట్‌తో ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది.
Avakai…♥♥ Learning from mom#Avakai #Homemade #JanathaCurfew #DayWithFamily pic.twitter.com/xQ2ifqaDGF
— Naga Shaurya (@IamNagashaurya) March 22, 2020
Read more also:
ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!
బ్రేకింగ్ న్యూస్: ఈ నెల 31 వరకూ బస్సులు, రైళ్లు సర్వీసులు బంద్