శానిటైజర్‌కు పెరిగిన భారీ డిమాండ్.. మాల్స్‌లో ఎదురు చూపులు

శానిటైజర్.. ఇప్పుడు మనకు నిత్యావసర వస్తువుల జాబితాలోకి వచ్చింది. దీంతో వీటికి మార్కెట్‌లో మాంచి డిమాండ్ పెరిగింది. కరోనా రక్కసిని ఎదుర్కోవాలంటే... మన వ్యక్తిగత పరిశుభ్రతే..

శానిటైజర్‌కు పెరిగిన భారీ డిమాండ్.. మాల్స్‌లో ఎదురు చూపులు
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2020 | 8:03 PM

శానిటైజర్.. ఇప్పుడు మనకు నిత్యావసర వస్తువుల జాబితాలోకి వచ్చింది. దీంతో వీటికి మార్కెట్‌లో మాంచి డిమాండ్ పెరిగింది. కరోనా రక్కసిని ఎదుర్కోవాలంటే… మన వ్యక్తిగత పరిశుభ్రతే సరైన ఆయుధం. ముఖ్యంగా కొవిడ్‌ను కట్టడి చేయాలంటే.. హ్యాండ్ వాష్‌ తప్పనిసరి. ఈ నేపథ్యంలో శానిటైజర్స్‌కు గిరాకీ బాగా పెరిగింది. దీంతో వాటి ధరలకూ రెక్కలొచ్చాయి. ఏ సూపర్ మార్కెట్‌లో చూసినా.. శానిటైజర్స్‌ కొనే కస్టమర్స్‌ రద్దీనే కనిపిస్తోంది.

నెలకు ముందు వీటి వాడకం పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని సామాన్యులు సైతం శానిటైజర్స్‌ కోసం ఎగబడుతున్నారు. హ్యాండ్‌ వాష్ క్లీనర్స్‌, డెటాల్, పేపర్ నాప్‌కిన్స్‌ కోసం అన్ని వర్గాల్లో డిమాండ్ పెరిగింది. శానిటైజర్స్‌కు డిమాండ్ పెరగడంతో.. ఇప్పుడు మార్కెట్లో కొరత ఏర్పడింది. పెద్ద సూపర్ మార్కెట్లలో కూడా దొరకని పరిస్థితి కనిపిస్తోందని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఉన్నా.. డబుల్ రేట్లతో తమ జేబులకు చిల్లులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని షాపులు తిరిగినా తమకు శానిటైజర్లు దొరకడం లేదని కస్టమర్లు ఆరోపిస్తున్నారు.

మరోవైపు శానిటైజర్ల కోసం ఆర్డర్లు పంపినా స్టాక్ రావడం లేదని.. స్టాక్ రాకుంటే తామేం చేయగలమని సూపర్ మార్కెట్ నిర్వాహకులు అంటున్నారు. కరోనా భయంతో తాము శానిటైజర్స్‌ కోసం తిరుగుతున్నామని.. ఐదారు షాపులు తిరిగినా శానిటైజర్స్ దొరకడం లేదని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ భయంతో తమ ఇళ్లను కూడా లైజోల్ వేసి రోజూ క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు మహిళలు.

ఇది కూడా చదవండి: ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు.. వీలునామా రద్దు చేయించిన తమ్ముడు! కారణమేంటంటే?

ఇది కూడా చదవండి: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!

Read More: 30 ఏళ్ల తర్వాత కూడా.. ‘కర్తవ్యం’కు అరుదైన గుర్తింపు.. ఆనందంలో విజయ శాంతి