బెంగాల్‌లో విజృంభిస్తోన్న కరోనా.. 40 వేలు దాటిన కేసులు.. రాజస్థాన్‌లో కొత్తగా..
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అన్‌లాక్ 1.0 తర్వాత పలు రాష్ట్రాల్లో అప్పటి వరకు వందల్లో ఉన్న పాజిటివ్ కేసులు ఒక్కసారిగా వేల సంఖ్యలోకి చే..

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అన్‌లాక్ 1.0 తర్వాత పలు రాష్ట్రాల్లో అప్పటి వరకు వందల్లో ఉన్న పాజిటివ్ కేసులు ఒక్కసారిగా వేల సంఖ్యలోకి చేరుకున్నాయి. తాజాగా రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా శనివారం నాడు వెస్ట్ బెంగాల్‌లో కొత్తగా మరో 2,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 40,209కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 27 మంది మరణించారు. ఈ విషయాన్ని వెస్ట్ బెంగాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 23,539 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
2,198 COVID-19 cases & 27 deaths have been recorded in West Bengal in last 24 hours, taking total cases to 40,209 including 23,539 recoveries & 1,076 deaths. Recovery rate among COVID-19 patients stands at 58.54%. 6,89,813 samples have been tested so far: State Health Department pic.twitter.com/M4KMPnnRao
— ANI (@ANI) July 18, 2020
ఇక రాజస్థాన్‌లో శనివారం నాడు కొత్తగా మరో 711 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 28500కి చేరింది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 21,144 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్జ అయ్యారు. రికవరీ రేటు బాగుండటంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు రాష్ట్రంలో 553 మంది మరణించారు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
711 new #COVID19 positive cases, 7 deaths, 518 recovered and 453 discharged in Rajasthan today. The total number of positive cases in the state rises to 28,500 including 553 deaths, 21,144 recovered and 20,459 discharged: State health department pic.twitter.com/ovrD9zNbH7
— ANI (@ANI) July 18, 2020



