Civil Services New Cadre Allocation: సివిల్ సర్వీస్ క్యాడర్ కేటాయింపులు మారాయ్.. కొత్త గ్రూపింగ్ చూశారా?
యూపీఎస్సీ చేపట్టే ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ నియామక ప్రక్రియ ఎంత కఠినమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యేటా లక్షలాది మంది యువత తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానిక ఈ పరీక్షలు రాస్తుంటారు. చివరికి పదుల సంఖ్యలో మాత్రమే ఎంపికవుతారు. వీరు మాత్రమే ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాల్లో చేరుతారు. నియామక సమయంలో క్యాడర్ కేటాయింపు ఉంటుంది. ఇందులో కేంద్రం తాజాగా కీలక మార్పులు చేసింది..

న్యూఢిల్లీ, జనవరి 26: కేంద్రం సివిల్ సర్వీసెస్ క్యాడర్ కేటాయింపులో సవరణలు చేసింది. అఖిల భారత సర్వీసుల క్యాడర్ కేటాయింపులకోసం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఇప్పటి వరకు అనుసరిస్తున్న జోనల్ విధానం స్థానంలో కొత్తగా గ్రూప్ విధానాన్ని తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలను అక్షర క్రమంలో 4 గ్రూపులుగా విభజించింది. అఖిల భారత సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులను ఈ గ్రూపులవారీగా క్యాడర్‌కు కేటాయించనున్నారు. దీంతో 2017 నుంచి అమలులో ఉన్న జోనల్ విధానం స్థానంలో కొత్త గ్రూపు విధానం అమల్లోకి తెచ్చింది. ఇవి గతంలో మొత్తం 5 జోన్‌లుగా ఉండేవి. తాజా వీటిని సవరించి 4 జోన్‌లుగా కుదించారు. అవేంటంటే..
సివిల్ సర్వీస్ క్యాడర్ కేటాయింపుకు త్తగా ఏర్పాటుచేసిన జోన్లు ఇవే..
- గ్రూప్ 1లో అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాలు, ఏపీ, అస్సాం–మేఘాలయ, బిహార్, ఛత్తీస్‌గఢ్
- గ్రూప్ 2లో గుజరాత్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్
- గ్రూప్ 3లో మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్తాన్, సిక్కిం, తమిళనాడు
- గ్రూప్ 4లో తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్
ఈ మేరకు 4 జోన్లను అక్షర క్రమంలో చేర్చారు. క్యాడర్ కేటాయింపుల్లో నిష్పాక్షికమైన, పారదర్శకతను పాటించడంకోసం అన్ని రాష్ట్రాల క్యాడర్, జాయింట్ క్యాడర్లను ఈ మేరకు విభజించినట్లు కేంద్రం వెల్లడించింది. అభ్యర్థుల ప్రాధాన్యం, ర్యాంకు, కేటగిరీ, ఆయారాష్ట్రాల్లో ఉన్న ఖాళీల ఆధారంగా సాధారణంగా క్యాడర్ కేటాయింపు చేస్తారు. ఇదివరకు రాష్ట్రాలను ప్రాంతాలవారీగా జోన్‌లుగా విభజించేవారు. ఇప్పుడు ఆ విధానం స్థానంలో అక్షరక్రమంలో గ్రూపింగ్ చేసి కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




