కరోనా దెబ్బ.. మోదీ సర్కార్ భారీ అప్పు

| Edited By:

Apr 01, 2020 | 9:38 AM

అసలే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళుతోందన్న భయం.. దానికి తోడు మహమ్మారి కరోనా దాడి.. వెరసి ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ఉత్పత్తి రంగం భారీగా నష్టపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోతున్నాయి. మరోవైపు వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1తో ఆరంభం కానున్న 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలోనే రూ.4.88 లక్షల కోట్లను అప్పుగా […]

కరోనా దెబ్బ.. మోదీ సర్కార్ భారీ అప్పు
Follow us on

అసలే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళుతోందన్న భయం.. దానికి తోడు మహమ్మారి కరోనా దాడి.. వెరసి ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ఉత్పత్తి రంగం భారీగా నష్టపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోతున్నాయి. మరోవైపు వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1తో ఆరంభం కానున్న 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలోనే రూ.4.88 లక్షల కోట్లను అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది.

కరోనా వైరస్ ముప్పుతో సంభవించే ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు అప్పు తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ ముప్పుతో సంభవించే ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారన్నారు. కరోనా వైరస్ ప్రభావాన్ని నియంత్రించే క్రమంలో కేంద్రం చాలా అప్రమత్తంగా ఉందని చక్రవర్తి తెలిపారు.

కాగా.. కొత్త ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణాలు రూ.7.8 లక్షల కోట్లుగా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు ఏడాది ఇది రూ.7.1 లక్షల కోట్లుగా ఉంది. పాత రుణాల చెల్లింపుల గురించి స్థూల రుణాల్లో సైతం ఉంటాయి. ఇక నికర రుణాలు 202-21కి రూ.5.36 లక్షల కోట్లు ఉంటాయని ఆమె అంచనా వేశారు. కాగా 2019-2020లో ఇది రూ.4.99 లక్షల కోట్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి:

లాక్‌డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు

వైన్స్‌‌ షాపులపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్

క్రికెటర్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

భారత్‌లో ఒక్క రోజులోనే 45కి చేరిన మృతుల సంఖ్య

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం..

అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ

వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’