సున్నితమైన సమయం.. చిల్లర రాజకీయాలు మానుకోండి..!

సున్నితమైన సమయంలో విపక్ష నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే స్వాగతిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల గురించి మాట్లాడిన ఆయన.. గుంటూరు, కర్నూలు, నెల్లూరు తప్ప ఇతర జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఆయన అన్నారు. ఎక్కువ కేసులు నమోదవుతున్నందున గుంటూరుపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో 500 పడకల కొవిడ్ ఆసుపత్రికి సిద్ధం చేస్తున్నామని వివరించారు. కరోనా […]

సున్నితమైన సమయం.. చిల్లర రాజకీయాలు మానుకోండి..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 19, 2020 | 9:28 PM

సున్నితమైన సమయంలో విపక్ష నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే స్వాగతిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల గురించి మాట్లాడిన ఆయన.. గుంటూరు, కర్నూలు, నెల్లూరు తప్ప ఇతర జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఆయన అన్నారు. ఎక్కువ కేసులు నమోదవుతున్నందున గుంటూరుపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో 500 పడకల కొవిడ్ ఆసుపత్రికి సిద్ధం చేస్తున్నామని వివరించారు. కరోనా వ్యాప్తి, నివారణ ప్రజల చేతుల్లోనే ఉందని తెలిపారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో మే 3న ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మంత్రి కోరారు. రాజధాని తరలింపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతామని అన్నారు. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం చేసే కృషిని స్వయంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారని మోపిదేవి గుర్తు చేశారు.

Read This Story Also: ‘పుష్ప’ నుంచి విజయ్ తప్పుకోవడానికి గల కారణమిదేనా..!