పండ్లు, కూరగాయలు, ప్యాకేజ్డ్ ఫుడ్‌తో ఢోకా లేదు
కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో ఎక్కడ వైరస్ భారీనపడతామోనన్న ఆందోళన సగటు మనిషిని పట్టిపీడిస్తోంది. దీంతో బయటకు వెళ్లి ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా వైరస్ భయమే వెంటాడుతోంది. అయితే ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో ఎక్కడ వైరస్ భారీనపడతామోనన్న ఆందోళన సగటు మనిషిని పట్టిపీడిస్తోంది. దీంతో బయటకు వెళ్లి ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా వైరస్ భయమే వెంటాడుతోంది. చాలా మంది కనీసం బయటకు వెళ్లి కూరగాయలు, పండ్లు కొనడానికి కూడా జంకుతున్నారు. బయట నుంచి ఆహార పదార్థాలు తెచ్చుకోవడం దాదాపుగా మానేశారు. అయితే ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి కారణంగా నిత్యవసర మార్కెట్లు, హోటళ్లు వినియోగదారులు లేక వెలవెలాపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయమే దీనికి కారణం. కూరగాయాలు, ఇతర ఆహార పదార్థాలు బయట నుంచి తెచ్చుకోవడం ద్వారా వైరస్ వ్యాపిస్తోందన్న ప్రచారం జరిగింది. దీంతో నిత్యం రద్దీగా వుండే కూరగాయల మార్కెట్లకు జనం వెళ్లడమే మానేశారు. ఇక బయట నుంచి ఆహార పదార్దాలు తెచ్చుకోవడం పూర్తిగా మానేశారు. ఇలా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు ఉన్నాయి. ఈ నేథఫ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. ఏ ఆహార పదార్థమైనా పరిమిత స్థాయిలో తీసుకోవాలని, వినియోగానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఫలానా పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కరోనా రాదనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది.
ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయల ద్వారా కోవిడ్–19 వ్యాప్తి చెందుతుందన్న దానికి ఆధారాల్లేవు. తగిన జాగ్రత్తలతో తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచించింది. పండ్లు, కూరగాయలను వాడే ముందు చేతుల్నిసబ్బుతో కడుకొని, వాటిని స్వచ్ఛమైన నీటితో కడగాలని సూచించింది.
జీవం ఉన్న జంతువులు, మనుషుల్లోనే వైరస్ బతికి ఉండడంతో పాటు, వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంది. ప్యాకేజీ ఉపరితలాల ద్వారా వైరస్ వ్యాపించదని తెలిపింది. కాబట్టి ప్యాకేజీ ఫుడ్ హానికరం కాదని. ఈ ఫుడ్ ప్యాకెట్లను శానిటైజ్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. కానీ వాటిని ముట్టుకునే ముందు, తినేటప్పుడు శుభ్రంగా చేతులు సూచించింది.
ఆహార పదార్థాల్లో ఉండే ఇతర వైరస్‌లు, బ్యాక్టీరియాల మాదిరిగానే నిర్ణీత ఉష్ణోగ్రత వరకు ఉడికిస్తే కరోనా వైరస్ కూడా చనిపోతుందని తెలిపింది. మాంసం, గుడ్లను కనీసం 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉడికించాలని సూచించింది. అయితే, మాంసం పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
గృహావసరాల కోసం మార్కెట్లు, మాల్స్‌కు వెళ్లినంత మాత్రాన కరోనా సోకదని తెలిపింది. కానీ మాల్స్, మార్కెట్లలోకి ప్రవేశించే ముందు చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచించింది. దగ్గు లేదా తుమ్ము వస్తే మోచేతిని అడ్డుపెట్టుకోవాలని. కనీసం మీటర్ భౌతికదూరం పాటించాలని తెలపింది. మాస్క్ రక్షణ తప్పనిసరిగా వినియోగించాలని కోరింది.
నిత్యావసరాల హోం డెలివరీ కారణంగా వైరస్ వ్యాపించదని తెలిపింది. కానీ ఆ సరుకులు తెచ్చే వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలని కోరింది. సరుకులు తీసుకున్న తర్వాత చేతులు చాలా జాగ్రత్తగా, శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. వైరస్ బారినపడకుండా బలమైన ఆహారం తీసుకోవాలని కోరింది. ధాన్యాలు, పండ్లు, మాంసం, కూరగాయలు, గింజలు, పీచు పదార్థాలు ఎక్కువ తినాలని సూచించింది. పసుపు, అల్లం ఎక్కువగా తీసుకుంటే కరోనా రాదనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది.