AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జ‌గ‌న్ ఆర్డ‌ర్ః మ‌ర‌ణించిన వారికి 24గంట‌ల్లో ప‌రిహారం..

కోవిడ్ దెబ్బ‌కు వ‌ణికిపోతున్న ఏపీని అకాల వ‌ర్షం ముంచేసింది. ప‌లు జిల్లాలో పిడుగులు ప‌డి ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. మృతుల‌కు ఆర్థిక భ‌రోసాను క‌ల్పించారు.

సీఎం జ‌గ‌న్ ఆర్డ‌ర్ః మ‌ర‌ణించిన వారికి 24గంట‌ల్లో ప‌రిహారం..
Jyothi Gadda
|

Updated on: Apr 10, 2020 | 2:01 PM

Share
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అత‌లాకుత‌లం అవుతోంది. ఓవైపు క‌రోనా ర‌క్క‌సి కోర‌లు చాస్తోంది. మ‌రోవైపు ప్ర‌కృతి ప్ర‌తాపం చూపిస్తోంది. కోవిడ్ దెబ్బ‌కు వ‌ణికిపోతున్న ఏపీని అకాల వ‌ర్షం ముంచేసింది. గురువారం ఎడ‌తెర‌పి లేకుండా కురిసిన భారీ వ‌ర్షానికి రాష్ట్రం అల్లాడిపోయింది. భారీ వర్షం, ఈదురుగాలులు వీచాయి. వర్షం, గాలుల దెబ్బకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల దెబ్బకు కొన్ని జిల్లాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి.. చెట్లు విరిగిపడ్డాయి. ప‌లు జిల్లాలో పిడుగులు ప‌డి ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. మృతుల‌కు ఆర్థిక భ‌రోసాను క‌ల్పించారు.
రాష్ట్రంలో గురువారం కురిసిన వర్షాల ధాటికి పిడుగుపాటు, బోటు ప్రమాదాల్లో మరణించిన వారికి 24 గంటలల్లో పరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా వైరస్ (కోవిడ్ 19) నివారణ చర్యలపై జిల్లాల కలెక్టర్లు, వైద్య సిబ్బందితో శుక్రవారం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణా చర్యలు, తాజా పరిణామాలు, లాక్ డౌన్ పరిస్థితులపై జగన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కరోనా నియంత్రణా చర్యల్లో నిమగ్నమైన జిల్లా కలెక్టర్లు, కోవిడ్‌ ఆస్పత్రుల వైద్యులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కరోనా మీద చేస్తున్న యుద్ధంలో కలెక్టర్లు, వైద్య వర్గాలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సీఎం వారిని ప్రశంసించారు.

Follow Us
అదృష్టం అంటే ఇదేనేమో..రూ.లక్షకు రూ.14 లక్షలు..ఇన్వెస్టర్లకు పండగే
అదృష్టం అంటే ఇదేనేమో..రూ.లక్షకు రూ.14 లక్షలు..ఇన్వెస్టర్లకు పండగే
ఏంట్రా ఇలా ఉన్నావ్.. అప్పుగా సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పోడిచాడు..
ఏంట్రా ఇలా ఉన్నావ్.. అప్పుగా సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పోడిచాడు..
మరణంలోనూ వీడని బంధం.. ఒకే రోజు రాత్రి వృద్ద దంపతుల మృతి!
మరణంలోనూ వీడని బంధం.. ఒకే రోజు రాత్రి వృద్ద దంపతుల మృతి!
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు
లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు
గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?
గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?
ఎలుకల ద్వారా వచ్చే వైరస్ ఓడలో ఎలా?
ఎలుకల ద్వారా వచ్చే వైరస్ ఓడలో ఎలా?