AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం కొత్త నిర్ణయం.. విలేజ్, వార్డు క్లీనిక్స్ ఏర్పాటు..

గ్రామాలు, వార్డుల్లో ఏర్పాటు చేయాల్సిన క్లీనిక్స్ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో వాటర్ గ్రిడ్ పనులను వెంటనే..

సీఎం కొత్త నిర్ణయం.. విలేజ్, వార్డు క్లీనిక్స్ ఏర్పాటు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 10, 2020 | 1:28 PM

Share

గ్రామాలు, వార్డుల్లో ఏర్పాటు చేయాల్సిన క్లీనిక్స్ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో వాటర్ గ్రిడ్ పనులను వెంటనే మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం వెంటనే టెండర్లు ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతగా వాటర్ గ్రిడ్ పనుల్లో భాగంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాలో చేపట్టాల్సిన పనులపై దృష్టి సారించాలన్నారు.

ఈ పనులకు సంబంధించి ఏప్రిల్ 16వ తేదీ వరకూ జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలని, జూన్ మొదటి వారానికల్లా టెండర్లు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్బీకేలు, విలేజ్ క్లీనిక్స్, పాఠశాలల్లో నాడు-నేడు, గ్రామ సచివాలయాల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు సీఎం. మార్చి 2021 కల్లా వీటి నిర్మాణం పూర్తికావాలన్నారు. ప్రజారోగ్యానికి చేటు తెస్తున్న కోవిడ్-19 లాంటి వైరస్‌ల నేపథ్యంలో విలేజ్ క్లీనిక్స్, వార్డు క్లీనిక్స్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అలాగే వైద్య పరంగా మౌలిక సదుపాయాలను పెంచుకునే ప్రక్రియలో భాగంగా వీటి అవసరం ఉందన్నారు. వార్డు క్లీనిక్స్‌ను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై మ్యాపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

ఇవి కూడా చదవండి:

పిడుగుపాటు.. ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన ప్రమాదం

కరోనా భయంతో మొబైల్ టవర్లకు నిప్పు.. కారణం ఇదే!

కరోనాపై పోరుకు భారీ ప్యాకేజీ సిద్ధం చేసిన కేంద్రం

కరోనా ఇంపాక్ట్: రిజర్వ్ బ్యాంకులో వెయ్యి కోట్లు అప్పుతీసుకున్న ఏపీ ప్రభుత్వం

బస్ టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీఎస్ఆర్టీసీ..

మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని.. ఈ సారి ఏం చేయాలంటే?

గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..

Follow Us
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్