కోట్ల‌ల్లో సీసీసీ ఛారిటీ విరాళాలు..మొత్తం లెక్క‌లు చెప్పిన చిరంజీవి

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో పేద క‌ళాకారుల‌ను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ట్ర‌స్ట్‌కు చిరంజీవి స్వయంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆయన విజ్ఞప్తి మేరకు ...

కోట్ల‌ల్లో సీసీసీ ఛారిటీ విరాళాలు..మొత్తం లెక్క‌లు చెప్పిన చిరంజీవి
Follow us

|

Updated on: Apr 01, 2020 | 6:30 AM

ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌తో పాటు భార‌త్‌ను ప‌ట్టిపీడిస్తోంది మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌. దీనిని నియంత్రించేందుకు యావ‌త్ భార‌తావ‌ని ఇప్పుడు యుద్ధం చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ లేని ఈ వైర‌స్ భూతాన్ని అరిక‌ట్టాలంటే సామాజిక దూరం ఒక్క‌టే మార్గం లాక్‌డౌన్. దీంతో అన్ని రంగాలు, అన్ని వ్య‌వ‌స్థ‌లు మూత‌ప‌డ్డాయి. కోవిడ్ -19 దెబ్బ‌కు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ మహమ్మారి ప్రభావం  సినిమా రంగం కూడా అత‌లాకుత‌లం అవుతోంది. షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. చాలా మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినీ పెద్దలందరూ కలిసి ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేశారు. దీనికి విరాళాలు అందించాల్సిందిగా సినీ ప్రముఖులను స్వయంగా చిరంజీవి అభ్యర్థించారు.
క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో పేద క‌ళాకారుల‌ను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ట్ర‌స్ట్‌కు చిరంజీవి స్వయంగా  కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆయన విజ్ఞప్తి మేరకు తెలుగు సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు ముందుకొచ్చారు. ఎవరి శక్తిమేర వారు విరాళాలు అందజేశారు. మార్చి 28న ఈ ఛారిటీని ఏర్పాటు చేయగా నాలుగు రోజుల్లో రూ.6.2 కోట్ల విరాళాలు అందాయి. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా రూ.6.2 కోట్లు సేకరించాం. ఈ నిధికి తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సాయం అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నా’’ అంటూ చిరంజీవి తన అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.
కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ఇచ్చినవారి వివరాలు:
–  చిరంజీవి – కోటి రూపాయలు –  నాగార్జున – కోటి రూపాయలు –  ప్రభాస్ – రూ.50 లక్షలు –  రామ్ చరణ్ – రూ. 30 లక్షలు –  నాని – రూ. 30 లక్షలు –  ఎన్టీఆర్ – రూ. 25 లక్షలు –  నాగచైతన్య – రూ. 25 లక్షలు –  అల్లు అర్జున్ – రూ. 20 లక్షలు –  వరుణ్ తేజ్ – రూ. 20 లక్షలు –  రవితేజ – రూ. 20 లక్షలు –  శర్వానంద్ – రూ. 15 లక్షలు – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ – రూ. 10 లక్షలు –  యూవీ క్రియేషన్స్ – రూ. 10 లక్షలు –  సాయిధరమ్ తేజ్ – రూ. 10 లక్షలు – విశ్వక్ సేన్ – రూ. 5 లక్షలు – శ్రీకాంత్ – రూ. 5 లక్షలు –  శ్రీమిత్ర చౌదరి – రూ. 5 లక్షలు –  సుశాంత్ – రూ. 2 లక్షలు –  కార్తికేయ – రూ. 2 లక్షలు –  వెన్నెల కిషోర్ – రూ. 2 లక్షలు –  సప్తగిరి – రూ. 2 లక్షలు –  లావణ్య త్రిపాఠి – రూ. 1 లక్ష –  సంపూర్ణేష్ బాబు – రూ. 1 లక్ష –  బ్రహ్మాజీ – రూ. 70వేలు
అంతేకాకుండా, ఎవరైనా విరాళాలు ఇవ్వాలని భావిస్తే తమ కరోనా క్రైసిస్ ఛారిటీ స్పెషల్ సేవింగ్ అకౌంట్‌కు పంపొచ్చన్నారు. ఈ మేరకు విరాళాలు పంపాల్సిన బ్యాంక్ ఖాతా వివరాలు వెల్లడించారు.
బ్యాంక్: ఐసీఐసీఐ, బంజారాహిల్స్ బ్రాంచ్, అకౌంట్ నంబర్: 0076 01 019951, ఐఎఫ్ఎస్‌సీ కోడ్: ICIC0000076.

భూమిని చదును చేస్తుండగా దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేయగా.!
భూమిని చదును చేస్తుండగా దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేయగా.!
3 వికెట్లతో చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా..
3 వికెట్లతో చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా..
రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆ గడువను పొడగిస్తూ నిర్ణయం
రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆ గడువను పొడగిస్తూ నిర్ణయం
వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..
వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..
వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా
వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..