షాకింగ్‌.. లక్షణాలు లేని వారిలోనే వైరస్ లోడు అధికం

లక్షణాలు ఉన్న వారి కంటే లేని వారిలోనే వైరస్ లోడు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింట్ సర్వేలో తేలింది

షాకింగ్‌.. లక్షణాలు లేని వారిలోనే వైరస్ లోడు అధికం

Coronavirus asymptomatic patients: లక్షణాలు ఉన్న వారి కంటే లేని వారిలోనే వైరస్ లోడు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింట్ సర్వేలో తేలింది. అంతేకాదు 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ రకం వైరస్ ఉన్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. మే, జూన్ నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో కరోనా బారిన పడిన 210 మంది డేటాను వారు విశ్లేషించారు. వారిలో వైరస్ లోడుకు తోడు, ఇమ్యూనిటీ లెవల్స్ కూడా ఉండటం వలన ఆరోగ్యంగా ఉన్నట్లు బయటికి కనిపిస్తున్నారని ఆ సర్వేలో తేలింది. వీరి నుంచి ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉన్న వారికి వైరస్ వ్యాపిస్తోందని, దీంతో వారు మృత్యువాతకు గురవుతున్నారని ఈ సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 57వేల మంది వైరస్ బారిన పడగా.. అందులో 70 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదని వారు పేర్కొన్నారు. లక్షణాలు ఉన్న వారితో పోలిస్తే, ఏ లక్షణాలు లేని అసింప్టమాటిక్ బాధితుల్లోనే వైరస్ లోడు అధికంగా ఉందని సెంటర్‌ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింట్స్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక 95 శాతం మందిలో 20 బ్లికేడ్‌ అనే రకానికి చెందిన కరోనా వైరస్ ఉందని, కేవలం ఐదు శాతం మందిలోనే ఇతర రకాలకు చెందిన వైరస్ ఉన్నట్లు తేలింది.

Read More:

Bigg Boss4: దేవికి షాకిచ్చిన కరాటే కళ్యాణి

Bigg Boss 4: బాలయ్య పాటకు గంగవ్వ అదిరిపోయే స్టెప్పులు