AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్‌లో రైళ్ల కూత.. బస్సులపై ఇంకా వీడని సస్పెన్స్!

జూన్ తొలివారం నుంచి ప్రజా రవాణాను పునరుద్ధరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణాను ప్రారంభించడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ దేశంలో గ్రీన్ జోన్ల సంఖ్య పెరుగుతుండటంతో జూన్ నుంచి ప్రజా రవాణా సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. అయితే మునుపటిలా కాకుండా కరోనా నేపథ్యంలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ, పలు […]

జూన్‌లో రైళ్ల కూత.. బస్సులపై ఇంకా వీడని సస్పెన్స్!
Ravi Kiran
|

Updated on: May 10, 2020 | 1:51 PM

Share

జూన్ తొలివారం నుంచి ప్రజా రవాణాను పునరుద్ధరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణాను ప్రారంభించడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ దేశంలో గ్రీన్ జోన్ల సంఖ్య పెరుగుతుండటంతో జూన్ నుంచి ప్రజా రవాణా సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. అయితే మునుపటిలా కాకుండా కరోనా నేపథ్యంలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ, పలు మార్పులు చేర్పులు చేసి మొదలుపెట్టాలని చూస్తున్నారు. మరోవైపు రైల్వే శాఖ విషయంలోనూ కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నెల 17తో లాక్ డౌన్ ముగుస్తుండటంతో.. ఆ రోజు ప్రజా రవాణా సర్వీసులపై సమీక్ష జరపాలని చూస్తున్నారు. ప్రధాని మోదీ సమావేశం తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ఇటు తెలంగాణాలో కూడా గ్రీన్ జోన్లు పెరుగుతున్నా.. ఆర్టీసీ బస్సులను నడిపే విషయంపై మాత్రం కేసీఆర్ సర్కార్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జనసాంద్రత ఎక్కువగా ఉండే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు ఇంకా రెడ్ జోన్లలోనే ఉన్నాయి. వీటితో అనుసంధానం లేకుండా బస్సులు నడపడం చాలా కష్టమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రయాణీకులు హైదరాబాద్- జిల్లాల మధ్యే రాకపోకలు సాగిస్తుంటారు. ఇక హైదరాబాద్ ఇప్పటిలో గ్రీన్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశాలు లేవు. అంతేకాకుండా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు అన్నీ కూడా పక్కపక్కనే ఉండటంతో ఇలాంటి పరిస్థితుల్లో బస్సులకు అనుమతిస్తే ఖచ్చితంగా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ నెల 15న సీఎం కేసీఆర్ మరోసారి సమీక్షించి బస్సు సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

కరోనాపై విరుగుడు.. భారత్ మరో ముందడుగు..

ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!

గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు…

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు..

సచిన్, ద్రావిడ్‌ల నీడలో సెహ్వాగ్ ప్రతిభ తగ్గిపోయింది!

Follow Us