హిందూ దేవాలయాల వద్ద డ్యూటీ చేసుకోండి.. మజ్లిస్ కార్పొరేటర్ హాల్‌చల్‌..

హిందూ దేవాలయాల వద్ద డ్యూటీ చేసుకోండి.. మజ్లిస్ కార్పొరేటర్ హాల్‌చల్‌..

లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ మూర్తుజ అలీ, అతని అనుచరులు రెచ్చిపోయారు. మాదన్నపేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని చావని ప్రాంతంలో బందోబస్తు చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై ప్రతాపం చూపించాడు. హిందూ దేవాలయాల వద్ద వెళ్లి డ్యూటీ చేసుకోండి అని మతం రంగు పులుముతూ అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ‘మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తానంటూ’ పోలీసు సిబ్బందికి సవాల్ విసిరాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం […]

Ravi Kiran

|

May 01, 2020 | 2:43 PM

లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ మూర్తుజ అలీ, అతని అనుచరులు రెచ్చిపోయారు. మాదన్నపేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని చావని ప్రాంతంలో బందోబస్తు చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై ప్రతాపం చూపించాడు. హిందూ దేవాలయాల వద్ద వెళ్లి డ్యూటీ చేసుకోండి అని మతం రంగు పులుముతూ అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ‘మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తానంటూ’ పోలీసు సిబ్బందికి సవాల్ విసిరాడు.

ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల వరకు వెళ్ళడంతో ఆ ఎంఐఎం కార్పోరేట్‌, అతని అనుచరాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంపై కార్పొరేటర్ వాదన మరోలా ఉంది. మసీదుకు తాళం వేయాలంటూ వారు బెదిరించారని.. అందుకు పర్మిషన్ లెటర్ చూపించమన్నానని తెలిపారు. అయితే వారు దాన్ని చూపించకుండా ప్రజలను బెదరించారని కార్పొరేటర్ పేర్కొన్నారు.

Read This: మద్యం తీసుకుంటే కరోనా అంతమైపోతుందట.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu