మద్యం తాగితే కరోనా పోతుంది.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

మద్యం తాగితే కరోనా పోతుంది.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

కరోనాకు లిక్కర్‌తో చెక్ పెట్టొచ్చునట.! ఎలాగైతే చేతులను ఆల్కహాల్‌తో శుభ్రంగా కడుక్కుంటే కరోనా రాదో.. అలాగే మద్యాన్ని తీసుకుంటే గొంతులో ఉన్న కరోనా అంతమైపోతుందట.. ఈ వ్యాఖ్యలు చేసింది స్వయానా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్ పూర్. రాజస్తాన్ రాష్ట్రంలో మద్యం షాపులు తెరవాలంటూ ఆయన సీఎం అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో వైన్ షాపులు తెరవాలని డిమాండ్ చేస్తూ భరత్ సింగ్ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. లాక్ డౌన్ వల్ల లిక్కర్ […]

Ravi Kiran

|

May 01, 2020 | 4:06 PM

కరోనాకు లిక్కర్‌తో చెక్ పెట్టొచ్చునట.! ఎలాగైతే చేతులను ఆల్కహాల్‌తో శుభ్రంగా కడుక్కుంటే కరోనా రాదో.. అలాగే మద్యాన్ని తీసుకుంటే గొంతులో ఉన్న కరోనా అంతమైపోతుందట.. ఈ వ్యాఖ్యలు చేసింది స్వయానా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్ పూర్. రాజస్తాన్ రాష్ట్రంలో మద్యం షాపులు తెరవాలంటూ ఆయన సీఎం అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాశారు.

రాష్ట్రంలో వైన్ షాపులు తెరవాలని డిమాండ్ చేస్తూ భరత్ సింగ్ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. లాక్ డౌన్ వల్ల లిక్కర్ దుకాణాలు మూసివేయడంతో రాష్ట్రానికి ఆర్ధికంగా భారీ నష్టం జరిగిందన్నారు. అంతేకాక రాష్ట్రంలో అక్రమ మద్యం సేవించడం కంటే షాపులు తెరవడమే మంచిదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మద్యం దుకాణాల మూసివేత కారణంగా రాష్ట్రంలో అక్రమ మద్యం దండా ఎక్కువైందని.. దీని వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతోందని భరత్ సింగ్ అన్నారు. కాగా, ఇప్పటికైనా ప్రభుత్వం అలోచించి వైన్ షాపులు తెరిస్తే మందుబాబులు హ్యాపీగా ఉంటారని.. అలాగే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని భరత్ సింగ్ వెల్లడించారు.

Read This: మందుబాబులకు గుడ్ న్యూస్.. లాక్ డౌన్ తర్వాత తెరుచుకోనున్న మద్యం షాపులు!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu