నేటి నుంచి ఏపీలో ఆర్టీసీ సర్వీసులు.. వారికి రాయితీ బంద్

దాదాపు 52 రోజుల లాక్ డౌన్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో బస్సులు రయ్.. రయ్ అంటున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేయగా.. రిజర్వేషన్లు కూడా మొదలయ్యాయి. కరోనా నేపధ్యంలో కేవలం సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లెవెలుగు బస్సులను మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది. అటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వీసులు […]

నేటి నుంచి ఏపీలో ఆర్టీసీ సర్వీసులు.. వారికి రాయితీ బంద్
Ravi Kiran

|

May 21, 2020 | 12:55 AM

దాదాపు 52 రోజుల లాక్ డౌన్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో బస్సులు రయ్.. రయ్ అంటున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేయగా.. రిజర్వేషన్లు కూడా మొదలయ్యాయి. కరోనా నేపధ్యంలో కేవలం సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లెవెలుగు బస్సులను మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది. అటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వీసులు నడవనున్నాయి. ఒక ప్రధాన స్టాప్‌ నుంచి మరో మెయిన్ స్టేషన్ వరకు నాన్ స్టాప్ సర్వీసుల మాదిరిగానే బస్సులు నడుస్తాయి.

బస్సు స్టేషన్లలో కూడా టికెట్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ 1500 బస్సులు రోడ్డెక్కనుండగా.. ప్రతీ డిపోలోనూ శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణం చేసే ప్రయాణీకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు అన్నారు. అత్యవసరమైతే వృద్దులు, పిల్లల ప్రయాణానికి అనుమతి ఇస్తామని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ వెల్లడించారు. ఇక బస్టాండ్లలోని అన్ని స్టాళ్ళలో మాస్కులు అందుబాటులో ఉంచుతామని.. వాటి ధర రూ. 10కి మించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఆర్టీసీ రాయితీ తాత్కాలికంగా రద్దు… వృద్దులు, వికలాంగులు, విద్యార్ధులు, జర్నలిస్టులుతో పాటు వివిధ వర్గాల వారికి ఇచ్చే రాయితీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు APSRTC ప్రకటించింది. ప్రస్తుతం ఇతర ప్రయాణీకులానే వీరికి కూడా టికెట్లను జారీ చేస్తామని ఆర్టీసీ తెలిపింది.

Read More:

10, 12వ తరగతి పరీక్షలు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..

మందుబాబులకు గుడ్ న్యూస్.. స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ డెలివరీ..

Flash News: ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్లు ప్రారంభం..

జూన్ 1న ప్యాసింజర్ రైళ్ల కూత.. గైడ్‌లైన్స్ విడుదల..

తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల వివరాలు ఇవే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu