AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,925 కరోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 95,366 మందికి కరోనా పరీక్షలు చేయగా 2,925 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,925 కరోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
Ap Corona
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 10, 2021 | 4:55 PM

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 95,366 మందికి కరోనా పరీక్షలు చేయగా 2,925 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.  తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,20,178 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో  26 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,986కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,937 మంది బాధితులు కోలుకున్నారు. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 18,77,930కి చేరింది.  రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం29,262  కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,28,94,611 శాంపిల్స్  పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలను దిగువన చూడండి….

దేశంలో కరోనా వివరాలు….

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 42,766 మందికి కరోనా సోకింది. క్రితంరోజు కంటే కేసులు కొద్దిమేర తగ్గాయి. గత కొన్ని రోజులుగా వెయ్యికి దిగువనే నమోదవుతోన్న మరణాలు నిన్న భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 1,206 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 3,07,95,716కి చేరగా.. 4,07,145 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు.

Also Read:  కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడుతాం.. కేటీఆర్​ ఘాటు కామెంట్స్

నిజామాబాద్ జిల్లాలో వలకు చిక్కిన అరుదైన చేప.. బరువెంతో తెలిస్తే షాక్ అవుతారు..!