CM Jagan About Lockdown: ‘కొవిడ్ రోగులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం’.. లాక్‌డౌన్‌పై సీఎం క్లారిటీ

దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

CM Jagan About Lockdown: 'కొవిడ్ రోగులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం'.. లాక్‌డౌన్‌పై సీఎం క్లారిటీ
Cm Jagan Review On Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 08, 2021 | 6:29 PM

AP Corona Updates:  దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను కట్టడి చేసేందుకు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయినప్పటికీ ఫలితం పెద్దగా కనిపించడం లేదు. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో రాత్రి నిర్భంధంతో పాటు కొన్నిచోట్ల లాక్‌డౌన్ కొనసాగుతోంది. తాజాగా లాక్‌డౌన్ నిర్ణయంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు.

వైద్య ఆరోగ్య శాఖలో నాడు- నేడు కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్భంధం విధించడం వలన ఆర్థికంగా నష్టపోతామని సీఎం వ్యాఖ్యానించారు. గతేడాది అమలు చేసిన లాక్‌డౌన్ వలన ఏపీకి 21వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మొన్నటివరకు వందల్లో ఉన్న కేసులు ప్రస్తుతం 2వేలకు పైగా చేరుకున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ పంపిణీలో వేగం పెంచాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ముందుగా ఫోకస్ పెట్టాలన్నారు. గ్రామాల్లో రోజుకు 4లక్షలు, అర్బన్‌ ప్రాంతాల్లో 2లక్షల డోసులు అందజేయాలన్నారు. వాక్సినేషన్‌ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు, ఆశావర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కరోనా రోగులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కొవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో దోపిడీ చేయటానికి వీల్లేదన్నారు.

అయితే, వ్యాక్సినేషన్ డోసులు సరిపడా అందుబాటులో లేవని అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. రోడ్డుపై మాస్కులు పెట్టుకోకుండా విచ్చలవిడిగా సంచరించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఏపీ సీఎం అధికారులను ఆదేశించారు.

Also Read: ఏపీలో కరోనా కల్లోలం.. ఊహించనంతగా పెరిగిన పాజిటివ్ కేసులు, ప్రమాదకరంగా మరణాలు

పెంపుడు పిల్లి మిస్ అయ్యింది.. ఇళ్లంతా వెతకగా.. షాకింగ్.. కొండచిలువ కడుపులో