Weird News: పెంపుడు పిల్లి మిస్ అయ్యింది.. ఇళ్లంతా వెతకగా… షాకింగ్.. కొండచిలువ కడుపులో

ఇళ్లలో కుక్కలు, పిల్లులు వంటి అందమైన పెట్ యానిమల్స్ పెంచడం మనలో చాలా మందికి ఇష్టం. చాలా మందికి ఈ జంతువులు వారి కుటుంబ సభ్యుల

Weird News: పెంపుడు పిల్లి మిస్ అయ్యింది.. ఇళ్లంతా వెతకగా... షాకింగ్.. కొండచిలువ కడుపులో
Missing Pet Cat Found Inside snake stomach
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 08, 2021 | 6:30 PM

python swallows cat: ఇళ్లలో కుక్కలు, పిల్లులు వంటి అందమైన పెట్ యానిమల్స్ పెంచడం మనలో చాలా మందికి ఇష్టం. కొందరికి ఈ జంతువులు వారి కుటుంబ సభ్యుల కంటే ఎంత మాత్రం తక్కువ కాదు. అందువల్ల, వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. సొంత బిడ్డల్లా, తోబుట్టువుల్లా సాకుతారు.  అలా పెంచుకున్న, మీకు ఇష్టమైన పెంపుడు జంతువు అకస్మాత్తుగా అదృశ్యమైతే.. ఆ బాధ వర్ణణాతీతం. అలాంటి ఒక సంఘటన ఇటీవల జరిగింది.  ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలిస్తే మీరు షాక్‌కు గురవ్వడం ఖాయం.

థాయిలాండ్లో, ఒక కుటుంబం పెంచుకుంటున్న పెంపుడు పిల్లి తప్పిపోయింది. దీంతో కుటుంబ సభ్యుల ఆందోళనతో దాన్ని.. అన్ని చోట్లా వెతకడం ప్రారంభించారు. కానీ అది ఎక్కడా కనిపించలేదు.  ఈ సమయంలో ఆ ఇంట్లోని బాలికకు ఒక రూమ్‌లో స్లాబ్ మీద భారీ కొండచిలువ కనిపించింది. పామును చూడగానే ఆ  అమ్మాయి భయంతో బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఆ అమ్మాయి తల్లికి.. కొండచిలువను చూసిన వెంటనే, గుండె ఆగినంత పనైంది. తమ పెంపుడు పిల్లి దాని కడుపులో ఉందని ఆమెకు అర్థమైంది. కొండచిలువ తన పిల్లిని మింగేసిందని ఆమె గుర్తించింది.  ఈ సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆ ఇంటికెళ్లి కొండచిలువను బందించారు. దాని కడుపులో ఉన్న పిల్లిని తీయడం కష్టమని చెప్పారు.  దీంతో ఆ కుటుంబం పడ్డ బాధ అంతా, ఇంతా కాదు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి.

Also Read: యజమానిపై పులి ఆకస్మిక దాడి.. కొమ్ములతో ఎగబడ్డ గేదెలు.. లగెత్తిన టైగర్..

ఈ నీలం అరటిపండ్లను ఎప్పుడైనా తిన్నారా..? టేస్ట్ అచ్చం వెనిలా ఐస్ క్రీమ్ లాగానే..