అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్

సచివాలయం బ్లాక్‌ 5 లోని ఉద్యోగులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే బ్లాక్‌ 2లోని 350 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 35 మంది అసెంబ్లి సెక్యూరిటీ సిబ్బందిని క్వారంటైన్‌కు పంపాగా, అసెంబ్లీ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న...

అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్
Follow us

|

Updated on: Jun 04, 2020 | 12:27 PM

ఆంధ్రప్రదేశ్‌ను కరోనా వైరస్ వెంటాడుతోంది. రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య మొత్తం 3279కి చేరింది. బుధవారం మధ్యాహ్నం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందగా.. 35 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం నాటికి 967 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఏపీ సచివాలయంలో ఇప్పటికే వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ కావటం కలకలం సృష్టించగా బుధవారం మరో ఉద్యోగికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

వైరస్ బారిన పడ్డ వ్యవసాయ శాఖ ఉద్యోగితోపాటు నవులూరులో అపార్టుమెంట్‌లో ఉంటున్న ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా బ్లాక్‌ 1లో డీఏడీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సచివాలయ ఉద్యోగులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా సచివాలయంలో బ్లాక్‌ 1లోని 250 మందికి పైగా ఉద్యోగులకు గుంటూరు నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం కోవిడ్‌ పరీక్షలు నిర్వహించింది. గురువారం బ్లాక్‌ 5 లోని ఉద్యోగులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

ఇప్పటికే బ్లాక్‌ 2లోని 350 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 35 మంది అసెంబ్లి సెక్యూరిటీ సిబ్బందిని క్వారంటైన్‌కు పంపాగా, అసెంబ్లీ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ ఒకరికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అతనితోపాటు విధులు నిర్వహిస్తున్న 35 మందిని మందడంలోని హైస్కూల్‌లో నిర్వహిస్తున్న క్వారంటైన్‌కు పంపారు. బుధవారం గుంటూరు నుంచి వచ్చిన కోవిడ్‌ నివారణ ప్రత్యేక బృందం అసెంబ్లీ ప్రాంగణంలో రసాయానాలతో శైనిటైజ్ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరూ రెండు రోజులపాటు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Latest Articles
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?