భారత్‌లో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 260 మంది మ‌ృతి

గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతిరోజూ రికార్డుస్థాయిలో 9వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,304 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

భారత్‌లో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 260 మంది మ‌ృతి
Follow us

|

Updated on: Jun 04, 2020 | 12:30 PM

Coronavirus outbreak update: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో భారత్‌ విలవిలలాడుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతిరోజూ రికార్డుస్థాయిలో 9వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,304 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే ఇంత పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు కావటం ఇదే మొదటిసారి. వైరస్ కారణంగా బుధవారం ఒక్క రోజే 260 మంది మృత్యవాత పడ్డారు. దీంతో కోవిడ్ 19 మృతుల సంఖ్య 6,075కు చేరింది.

దేశంలో కరోనాకు చిక్కిన వారి సంఖ్య 2,16,919గా ఉంది. ఇందులో 6,075 మంది కరోనాతో చనిపోయినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండటం కొంత వరకు ఊరటనిస్తోంది. ఇప్పటి వరకు 1,04,107 మంది కోలుకోగా 1,06,737 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.