క్షీణించిన ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం! మరో ఆస్పత్రికి తరలింపు
ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటనే ఆమెను నాగర్‌పూర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. కొద్ది రోజుల క్రితం నవనీత్ కౌర్ సహా ఆమె కుటుంబంలోని 12 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వారందరూ ముంబైలోని అమరావతి..
ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటనే ఆమెను నాగర్‌పూర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. కొద్ది రోజుల క్రితం నవనీత్ కౌర్ సహా ఆమె కుటుంబంలోని 12 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వారందరూ ముంబైలోని అమరావతి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో హఠాత్తుగా నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటనే ఆమెను నాగర్‌పూర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు.
నవనీత్ కౌర్ భర్త ఎమ్మెల్యే రవికి ఆగష్టు 6న కరోనా సోకింది. దీంతో కుటుంబంలోని వారందరూ టెస్టులు చేయించుకోగా మొత్తం 12 మందికి కోవిడ్ పాజిటివ్ అని రిపోర్టుల్లో తేలింది. ఇందులో నవనీత్ అత్త, మామలు, పిల్లలు కూడా ఉన్నారు. ఇక తమకు కరోనా సోకిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ తెలిపారు. అలాగే గత కొద్ది రోజులుగా తమను కలిసిన వారంతా కోవిడ్ వైరస్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే అందరూ హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని తెలిపారు. ఇక 2019లో బీజేపీ తరుపున అమరావతి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ నవనీత్ కౌర్.. స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.
Read More: