Breaking: కరోనా నుంచి కోలుకున్న నటి

కరోనా మహమ్మారిని తాను జయించానని..  ఈ వ్యాధి నుంచి తాను పూర్తిగా కోలుకున్నానని హాలీవుడ్ నటి ఓల్గా కురిలెంకో అన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. తన కుమారుడితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది.

Breaking: కరోనా నుంచి కోలుకున్న నటి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 23, 2020 | 8:47 PM

కరోనా మహమ్మారిని తాను జయించానని..  ఈ వ్యాధి నుంచి తాను పూర్తిగా కోలుకున్నానని హాలీవుడ్ నటి ఓల్గా కురిలెంకో అన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. తన కుమారుడితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. మొదటి వారమంతా నేను చాలా బాధపడ్డాను. తీవ్ర జ్వరం, తలనొప్పితో ఎక్కవ సమయాన్ని నిద్రపోతూ.. బెడ్ మీదే గడిపాను. రెండో వారం నాకు జ్వరం తగ్గింది. కానీ స్వల్ప దగ్గుతో బాగా నీరసపడిపోయాను. రెండో వారం పూర్తి అయిన తరువాత నేను కోలుకున్నా. దగ్గు దాదాపుగా తగ్గిపోయింది. కేవలం ఉదయం పూట మాత్రమే దగ్గు వస్తోంది. క్రమేపి తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు నా సమయాన్ని నా పని మీద, నా కుమారుడికి కేటాయించాను అని తెలిపారు.

కాగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఓల్గా ఆ మధ్యన సోషల్ మీడియాలో తెలిపారు. ఇంట్లోనే తాను చికిత్సను పొందుతున్నానని ఆమె తెలిపారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆ తరువాత జ్వరం తగ్గిన సమయంలో మరో పోస్ట్ చేసిన ఓల్గా.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని వెల్లడించారు.  అంతేకాదు కరోనాను జయించేందుకు కొన్ని కీలక సూచనలు కూడా చేశారు. ఇక ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని తెలపడంతో.. ఆమె ఫ్యాన్స్  ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read This Story Also: అనసూయ ట్వీట్.. ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు..!

https://www.instagram.com/p/B-DPRf1ha-q/?utm_source=ig_embed