ఆరోగ్య సేతు యాప్‌పై కేంద్రం క్లారిటీ..! త‌ప్ప‌ని స‌రి..

కరోనా వైరస్ కట్టడికి కేంద్రం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్‌పై పలు విమర్శలు, వివాదాలు త‌లెత్తున్నాయి. ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ వల్ల వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆరోగ్యసేతు యాప్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టతనిచ్చింది.

ఆరోగ్య సేతు యాప్‌పై కేంద్రం క్లారిటీ..! త‌ప్ప‌ని స‌రి..
Follow us

|

Updated on: Jun 13, 2020 | 2:03 PM

కరోనా వైరస్ కట్టడికి కేంద్రం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్‌పై పలు విమర్శలు, వివాదాలు త‌లెత్తున్నాయి. ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ వల్ల వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీనిపై న్యాయస్థానాల్లోనూ వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. అయితే, ఆరోగ్యసేతు యాప్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టతనిచ్చింది.

ప్రయాణాల్లో ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి కాదని, అది లేకుండా కూడా రైళ్లు, విమానాల్లో ప్రయాణించవచ్చని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. బెంగళూరుకు చెందిన సైబర్ కార్యకర్త అనివర్ అరవింద్ ఈ యాప్‌కు సంబంధించి పలు సందేహాలను వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది. ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే ప్రయాణాలకు అనుమతిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని, ఇది లేకుండా కూడా రైళ్లు, విమానాల్లో ప్రయాణించవచ్చని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్న అనుమానాలకు పూర్తి స్థాయిలో తెరపడినట్టైంది.

శుక్రవారం నాటి విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎంఎన్ నర్గుంద్ వాదనలు వినిపించారు. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, వాడకంపై ప్రజలకే నిర్ణయాధికారం ఇచ్చామన్నారు. ఆరోగ్యసేతు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన అవసరం లేదని, దానికి బదులుగా స్వీయ ధ్రువీకరణ పత్రాన్నిఇచ్చినా సరిపోతుందని వెల్లడించారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించేవారు తప్పనిసరిగా ఉండాలనే అంశంపై కూడా ధర్మాసనం ప్రశ్నించింది. జులై 10న దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పిన కోర్టు విచారణ వాయిదా వేసింది.

బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?