AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసిన ఆరోగ్య సేతు యాప్..

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రజా సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ప్రతీ ఒక్కరూ తమ ఫోన్‌లో ఉంచుకోవాలని, ప్రయాణం చేసే సమయంలో ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టుకోవాలని భారత ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆఫీసుల్లో, పలు కార్యక్రమాల్లో, షాపింగ్ మాల్స్‌కి..

ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసిన ఆరోగ్య సేతు యాప్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 17, 2020 | 12:00 PM

Share

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రజా సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ప్రతీ ఒక్కరూ తమ ఫోన్‌లో ఉంచుకోవాలని, ప్రయాణం చేసే సమయంలో ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టుకోవాలని భారత ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆఫీసుల్లో, పలు కార్యక్రమాల్లో, షాపింగ్ మాల్స్‌కి ఎక్కడికి వెళ్లినా ఈ యాప్‌ను ఉపయోగించాలని కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరోగ్య సేతు యాప్ మరో రికార్డు సాధించింది. ఏప్రిల్‌లో 80 మిలియన్లుగా ఉన్న డౌన్‌లోడుల సంఖ్య జులై నాటికి 127.6 మిలియన్లకు చేరుకుంది. దీంతో ప్రపంచంలోనే అధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న కోవిడ్ ట్రాకింగ్ యాప్‌గా రికార్డు సాధించింది.

కోవిడ్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలతో పాటు ఎప్పటికప్పుడు చుట్టు పక్కల ప్రాంతాలలో కరోనా వైరస్‌కు సంబంధించిన రోగులు ఉంటే తెలియచెబుతూ.. ఈ యాప్ అలెర్ట్ చేస్తుంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ యాప్‌ను దేశ వ్యాప్తంగా విడుదల చేయగా కేవలం 13 రోజుల్లోనే 50 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఏప్రిల్ 26 తేదీ నాటికి ఈ సంఖ్య 75 మిలియన్లు దాటగా.. మే 6వ తేదీ వరకూ ఈ సంఖ్య 90 మిలియన్లకు చేరుకుంది. ఇక జులైలో 127 మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

Read More: 

లద్ధాఖ్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తుపాకీ ఎక్కు పెట్టి..

షేర్ ఇట్‌కు ధీటుగా భారత్ ‘షేర్ యాప్’..

లోకల్ ట్రైన్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే..!
లోకల్ ట్రైన్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే..!
లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!