మరో కొత్త వైరస్ కలకలం.. వందల సంఖ్యలో గుర్రాలు మృతి..

ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను పట్టి పీడిస్తుంటే.. ఆ మధ్య అదేదో ‘ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్’ అనే వైరస్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో వ్యాప్తి చెందటంతో వేల పందులు మృతి చెందాయి. అది కేవలం జంతువులకు మాత్రమే వచ్చే వైరస్ కావడంతో మనుషులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి అదే ఆఫ్రికా నుంచి కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. థాయ్‌లాండ్‌ దేశంలో ఈ వైరస్ వ్యాప్తి చెంది వందలాది గుర్రాలు చనిపోతున్నాయి. అసలు […]

మరో కొత్త వైరస్ కలకలం.. వందల సంఖ్యలో గుర్రాలు మృతి..
Follow us

|

Updated on: May 23, 2020 | 7:05 PM

ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను పట్టి పీడిస్తుంటే.. ఆ మధ్య అదేదో ‘ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్’ అనే వైరస్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో వ్యాప్తి చెందటంతో వేల పందులు మృతి చెందాయి. అది కేవలం జంతువులకు మాత్రమే వచ్చే వైరస్ కావడంతో మనుషులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి అదే ఆఫ్రికా నుంచి కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. థాయ్‌లాండ్‌ దేశంలో ఈ వైరస్ వ్యాప్తి చెంది వందలాది గుర్రాలు చనిపోతున్నాయి.

అసలు ఈ వైరస్ ఏంటి.? గబ్బిలాల నుంచి సోకిందా.? మనుషులకు కూడా సోకుతుందా.? అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇక థాయ్‌లాండ్‌ రాజధాని అయిన బ్యాంకాక్‌లోని ఓ గుర్రాలశాలలో ఇప్పటికే 18 గుర్రాలు ఈ వైరస్ కారణంగా మృతి చెందాయి. చైనాకు కొన్ని జీబ్రాలను తీసుకెళ్ళేటప్పుడు.. వాటి నుంచి ఈ వైరస్ గుర్రాలకు సోకినట్లు అక్కడి వాళ్లు కనుగొన్నారు. ఫిబ్రవరి చివరిలోనే ఈ వైరస్ బ్యాంకాక్ చుట్టుపక్కల ప్రదేశాల్లో వ్యాప్తి చెందగా.. సుమారు 500పైగా గుర్రాలు దీని వల్ల చనిపోయాయి.

మార్చిలో ఇంగ్లాండ్‌లో చనిపోయిన గుర్రాల రక్త నమూనాలను పరిశీలించగా.. ఇది ఆఫ్రికన్ వైరస్‌గా తేలింది. ఇది మనుషులకు హాని కలిగించే వైరస్ కాదని.. ఆఫ్రికాలోని జీబ్రాస్‌తో సహా ఈక్విన్స్‌లో విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు. . ఈ వ్యాధి మిడ్జెస్ అనే దోమ లాంటి కీటకాన్ని కొరకడం వల్ల వ్యాపించిందని తేల్చారు. కాగా, గత 50 ఏళ్లలో ఈ వైరస్ ఆసియాలో వ్యాప్తి చెందలేదని తెలిపారు.

Read More:

కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..

జేఎన్టీయూ కీలక నిర్ణయం.. జూన్‌ 20 నుంచి బీటెక్ పరీక్షలు..

రైల్వే ప్రయాణీకులకు మరో శుభవార్త…

భక్తులకు ముఖ్య గమనిక.. టీటీడీ వెబ్‌సైట్‌ పేరు మార్పు..

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం