రైలు ప్రయాణంలో దంపతుల వినూత్న ప్రయోగం..

కరోనా కారణంగా రైల్వేశాఖ అనేక జాగ్రత్తలు పాటిస్తోంది.. మాస్క్‌లు, శానిటైజర్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ దంపతులు

రైలు ప్రయాణంలో దంపతుల వినూత్న ప్రయోగం..

భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసులు రెండు లక్షల మార్క్‌ను దాటగా..తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ భూతం జడలు విప్పుకుంటోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజూ వందకు చేరువలో నమోదు అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో కరోనాతో కలిసి జీవించాల్సిందేనని అనేక దేశాలతో పాటు భారత ప్రభుత్వం కూడా సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో మనదేశంలోనూ కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్-5.0లో అనేక సడలింపులు ఇచ్చిన సంగతి విధితమే. దీంతో రైళ్లు, బస్సు సర్వీసులు మొదలవ్వడంతో ప్రయాణాలు మొదలయ్యాయి. ఇక రైళ్లు కూడా పట్టాలెక్కడంతో.. ఎక్కువమంది ప్రయాణాలు మొదలు పెట్టారు. కరోనా కారణంగా రైల్వేశాఖ అనేక జాగ్రత్తలు పాటిస్తోంది.. మాస్క్‌లు, శానిటైజర్ తప్పనిసరి చేసింది. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రయాణికులు కూడా వారి ఏర్పాట్లలో వాళ్లు ఉంటున్నారు.

రైళ్లో ప్రయాణిస్తున్న ఓ భార్యాభర్తలు కరోనా భయంతో వినూత్న పద్దతిని పాటించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు వారు చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు. తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ దంపతులు తమను తాము రక్షించుకోవడం కోసం.. తమకు కేటాయించిన బెర్తులకు తెరలు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా తుమ్మినా, దగ్గినా ఇబ్బంది లేకుండా..తమ చుట్టూ రక్షణగా వలయంగా తెరను కట్టుకున్నారు. దీంతో అది చూసిన తోటి ప్రయాణికులు మొదట ఆశ్చర్యపోయారు. కానీ, ఆ తర్వాత వారు చేసిన పనిని అందరూ ప్రశంసించారు. వైరస్ పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని అంటున్నారు.