Prisoners: జైళ్లపై కరోనా పంజా.. కర్నాల్ జైలులో 56 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్..

Covid-19 Positive: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కేసులు, నాలుగువేలకు చేరువలో మరణాలు

Prisoners: జైళ్లపై కరోనా పంజా.. కర్నాల్ జైలులో 56 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్..
Karnal Jail
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 12, 2021 | 9:27 AM

Covid-19 Positive: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కేసులు, నాలుగువేలకు చేరువలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటి వాటిని అమలు చేస్తున్నారు. దీంతో అంతటా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి జైళ్ల‌పై కూడా పంజా విసురుతోంది. ఇప్పటికే పలు జైళ్లల్లో ఉన్న ఖైదీలు కరోనా బారిన పడి మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హ‌ర్యానాలోని క‌ర్నాల్ జైలులో సుమారు 56 మంది ఖైదీలకు క‌రోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జైలు అధికారులు వారికోసం ప్ర‌త్యేకంగా ఐసోలేష‌న్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. పెద్ద ఎత్తున ఖైదీలు కరోనా బారిన‌ప‌డ‌టంతో జైలులోనే ఒక ఐసోలోష‌న్ జోన్‌ను ఏర్పాటుచేశామ‌ని అధికారులు వెల్లడించారు. అయితే కేసుల కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎవరికైనా పరిస్థితి విషమిస్తే ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు సైతం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నారని.. జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. సోమ‌వారం ఒడిశాలోని మయూర్‌భంజ్ ఉడల సబ్‌-జైలులో 21 మంది ఖైదీలకు కరోనా బారిన పడ్డారు. వీరిని ఐసొలేషన్‌లో ఉంచినట్టు జైలు అధికారులు వెల్ల‌డించారు. ఖైదీల విషయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని మయూర్ భంజ్ జైలు అధికారులు వెల్లడించారు. కరోనాబారిన పడిన ఖైదీలకు సరైన వైద్య చికిత్స అందిస్తున్నామని.. అవసరమైతే కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలిస్తామని తెలిపారు. కాగా ఇటీవల కరోనా బారిన పడి ఢిల్లీలోని తీహార్ జైలులో దాదాపు 5గురు మరణించారు. అంతేకాకుండా ఆర్జేడీ మాజీ ఎంపీ కూడా మరణించారు.

Also Read:

Chundur SI: కానిస్టేబుల్‌తో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి..

నేను విసిగిపోయాను.. ఇలాంటి రూమర్స్ గురించి ఏం చెప్పాలో తెలియడంలేదు.. మరణవార్తలపై స్పందించిన శక్తిమాన్ నటుడు..