AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరికొత్త ప్రయోగం, 2-18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాక్సిన్, నిపుణుల కమిటీ సిఫారసు, ఇక 2, 3 క్లినికల్ ట్రయల్స్ కి భారత్ బయో టెక్ రెడీ ?

దేశంలో పిల్లలలకు కూడా కరోనా వైరస్ సోకుతోందని వార్తలు వస్తున్నతరుణంలో భారత్ బయో టెక్ సంస్థ వినూత్న ఆలోచన చేసింది. తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ని ఈ ఏజ్ గ్రూప్ వారికి కూడా ఇస్తే ఎలా ఉంటుందని భావించింది...

సరికొత్త ప్రయోగం, 2-18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాక్సిన్, నిపుణుల కమిటీ సిఫారసు, ఇక 2, 3 క్లినికల్ ట్రయల్స్ కి భారత్ బయో టెక్ రెడీ ?
Covaxin Recommended For Next Phase Of Trials For 2 18 Age Group
Umakanth Rao
| Edited By: |

Updated on: May 12, 2021 | 10:28 AM

Share

దేశంలో పిల్లలలకు కూడా కరోనా వైరస్ సోకుతోందని వార్తలు వస్తున్నతరుణంలో భారత్ బయో టెక్ సంస్థ వినూత్న ఆలోచన చేసింది. తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ని ఈ ఏజ్ గ్రూప్ వారికి కూడా ఇస్తే ఎలా ఉంటుందని భావించింది. అందుకే 2 నుంచి 18 ఏళ్లలోపు వారికి తమ టీకామందు ఇచ్చేందుకు, ఇందుకు సంబంధించి 2, 3 దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థనను నిపుణుల కమిటీ దృష్టికి తేగా ఆ కమిటీ ఇందుకు సిఫారసు చేసింది. ఢిల్లీ లోని ఎయిమ్స్, పాట్నా లోని ఎయిమ్స్, నాగపూర్ లోని మెడిట్రినా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తో బాటు 525 చోట్ల ఈ రెండు, మూడో దశ ట్రయల్స్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. సెంట్రల్ డ్రగ్స్ ఆఫ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ నిన్న ఈ ప్రతిపాదనపై లోతుగా చర్చించింది. 2 నుంచి 18 ఏళ్ళ లోపు వయస్సు వారిపై తమ ట్రయల్స్ నిర్వహణకు అనుమతినివ్వాలని భారత్ బయోటెక్ పెట్టుకున్న దరఖాస్తుపై ఈ కమిటీ సుదీర్ఘంగా చర్చించి ఈ మేరకు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పరీక్షల్లో సేఫ్టీ కి అత్యంత ప్రాధాన్యమివ్వాలని నిపుణుల బృందం ఈ కంపెనీని కోరింది. పిల్లలపై ప్రయోగాలంటే మాటలు కాదని, అందువల్ల ఈ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది.

మొదట భద్రత, సురక్షిత అంశాలకు సంబంధించి హామీ ఇవ్వాలని సూచించింది. గత ఫిబ్రవరి 24 న జరిగిన ఓ సమావేశంలో ఈ విషయమై కమిటీ చర్చించింది. తమ సవరించిన క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్ ని సమర్పించాలని భారత్ బయోటెక్ సంస్థను కమిటీ కోరింది.ఇప్పటికే కోవాగ్జిన్ వాక్సిన్ దేశంలో పాపులర్ అయింది. మరిన్ని చదవండి ఇక్కడ : viral video : చెన్నై స్టేషన్ లోని పోలీసులు డాన్స్ లు ..తప్పు అయ్యినప్పటికీ ట్వీబుల్ నుండి ప్రసంశలు వెల్లువా వైరల్ అవుతున్న వీడియో Viral Video : నాగుపామా..? అయితే నాకేంటి…షాకిచ్చిన బామ్మ.వామ్మో ఈ బామ్మ ధైర్యం చుస్తే షాక్ అవ్వాల్సిందే..(వీడియో).

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?