ఆ జిల్లాలో 13 మంది కోలుకున్నారు.. అందులో 11 మంది తబ్లీఘీలు..

యూపీలో కరోనా మహమ్మారి ఓ వైపు విజృంభిస్తున్నా.. అదే సమయంలో బాధితులు కూడా కరోనా మహమ్మారిని జయిస్తున్నారు. తాజాగా షమ్లీ జిల్లాలో 13 మంది కరోనా నుంచి బయటపడ్డారు. వీరిలో 11 మంది తబ్లీఘీ జమాత్ సభ్యులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ 13 మందికీ వరుసగా రెండుసార్లు కరోనా పరీక్షలు జరపగా.. రెండు సార్లు కరోనా నెగిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే వీరంతా కరోనా నుంచి కోలుకున్నా కూడా.. కొద్ది రోజులపాటు ఓ […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:48 pm, Fri, 24 April 20
ఆ జిల్లాలో 13 మంది కోలుకున్నారు.. అందులో 11 మంది తబ్లీఘీలు..

యూపీలో కరోనా మహమ్మారి ఓ వైపు విజృంభిస్తున్నా.. అదే సమయంలో బాధితులు కూడా కరోనా మహమ్మారిని జయిస్తున్నారు. తాజాగా షమ్లీ జిల్లాలో 13 మంది కరోనా నుంచి బయటపడ్డారు. వీరిలో 11 మంది తబ్లీఘీ జమాత్ సభ్యులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ 13 మందికీ వరుసగా రెండుసార్లు కరోనా పరీక్షలు జరపగా.. రెండు సార్లు కరోనా నెగిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

అయితే వీరంతా కరోనా నుంచి కోలుకున్నా కూడా.. కొద్ది రోజులపాటు ఓ క్వారంటైన్‌ వార్డుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. మొత్తం 17 మందిలో ఇంకా మరో నలుగురికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. మరోవైపు జిల్లాలోని హాట్‌స్పాట్‌లను ఇప్పటికే పూర్తిస్థాయిలో మూసేశారు. కరోనా కట్టడికి అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు.