VSSC Recruitment 2022: విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలున్నవారు నేరుగా ఇంటర్వ్యూకు..

భారత ప్రభుత్వ స్పేస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌.. 194 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

VSSC Recruitment 2022: విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలున్నవారు నేరుగా ఇంటర్వ్యూకు..
VSSC Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 02, 2022 | 4:35 PM

భారత ప్రభుత్వ స్పేస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌.. 194 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ, 60 శాతం మార్కులతో హోటల్‌ మేనేజ్‌మెంట్‌/కేటరింగ్‌ టెక్నాలజీ డిగ్రీ, 60 శాతం మార్కులతో ఫైనాన్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌/కంప్యూటర్‌ అప్లికేషన్‌ స్పెషలైజేషన్‌లో బీకాం లేదా తత్సమాన కోర్సులో 2020 ఏప్రిల్‌కు ముందు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు అక్టోబర్‌ 30, 2022వ తేదీ నాటికి 30 యేళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు నవంబర్‌ 12, 2022వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.9000లు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ఎయిరోనాటికల్‌/ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ ఖాళీలు: 15
  • కంప్యూటర్‌ సైన్స్‌/ఇంజనీరింగ్‌ ఖాళీలు: 20
  • ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ ఖాళీలు: 43
  • మెటలర్జీ ఖాళీలు: 6
  • ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌ ఖాళీలు: 4
  • ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ ఖాళీలు: 2
  • హోటల్‌ మేనేజ్‌మెంట్‌/కేటరింగ్‌ టెక్నాలజీ ఖాళీలు: 4
  • బీకాం(ఫైనాన్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌) ఖాళీలు: 25
  • బీకాం (కంప్యూటర్‌ అప్లికేషన్‌) ఖాళీలు: 75

అడ్రస్‌: Main Auditorium, St.Mary’s Higher Secondary School, Pattom, Thiruvananthapuram, Kerala.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పెళ్లైన ఆ స్టార్ హీరోతో ఎఫైర్.. కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్
పెళ్లైన ఆ స్టార్ హీరోతో ఎఫైర్.. కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్
బాయ్‌ఫ్రెండ్‌తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ.. ఫొటోస్
బాయ్‌ఫ్రెండ్‌తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ.. ఫొటోస్
సార్లొస్తున్నారని బంగారంలాంటి చెట్లు నరికేశారు..!
సార్లొస్తున్నారని బంగారంలాంటి చెట్లు నరికేశారు..!
రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు