SBI Recruitment 2022: రాత పరీక్షలేకుండా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మార్కామ్), సీనియర్ ఎగ్జిక్యూటివ్ (డిజిటల్ మార్కెటింగ్), సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

SBI Recruitment 2022: రాత పరీక్షలేకుండా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..
ఈ టర్మ్ డిపాజిట్లు అన్ని 6.75% వడ్డీ రేటును పొందుతాయి. మెచ్యూరిటీ వ్యవధి 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లకు ఇప్పుడు 6.75% వడ్డీ రేటు, 50 bps ఎక్కువగా లభించనుంది. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ, 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే FDలు ఇప్పుడు 6.25% వడ్డీ రేటు లభించనుంది.
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 02, 2022 | 3:32 PM

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మార్కామ్), సీనియర్ ఎగ్జిక్యూటివ్ (డిజిటల్ మార్కెటింగ్), సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎం లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 30 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలు కలిగిన వారు నవంబర్‌ 18, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులకు రూ.750లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి పోస్టును బట్టి ఏడాదికి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: Main Auditorium, St.Mary’s Higher Secondary School, Pattom, Thiruvananthapuram, Kerala.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.