UPSC Recruitment 2021: యూపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ..
UPSC Recruitment 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించనున్న ఇంజనీరింగ్ సర్వీసెస్, జియో సైంటిస్ట్ నియామకాలకు దరఖాస్తు...
UPSC Recruitment 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించనున్న ఇంజనీరింగ్ సర్వీసెస్, జియో సైంటిస్ట్ నియామకాలకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇంజనీరింగ్, జియో సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖార్తు చేసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోని వాళ్లు వీలైనంత ద్వారగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 247 ఇంజనీరింగ్ సర్వీస్ పోస్టులు, 192 జియో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి యూపీఎస్సీ సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. 22 సెప్టెంబర్, 2021 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా.. నేటి ఆ గడువు ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ప్రిలిమ్స్ ఎప్పుడంటే.. జియో సైంటిస్ట్, ఇంజనీరింగ్ సిర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2022 ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్నారు. పరీక్షకు కొద్ది రోజుల ముందు అడ్మిట్ కార్డును జారీ చేస్తారు.
అర్హత.. జియో సైంటిస్ట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జియోలాజికల్ సైన్స్ సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగి ఉండాలి. అదే సమయంలో, కొన్ని పోస్టులకు వేర్వేరు అర్హతలు నిర్ణయించబడ్డాయి. వాటి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
ఇంజనీరింగ్ సర్వీసెస్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లేదా స్ట్రీమ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- upsc.gov.in ని సందర్శించవచ్చు.
వయోపరిమితి.. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఇలా అప్లై చేయండి.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇచ్చిన ఎగ్జామ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇంజనీరింగ్ సర్వీసెస్, జియో సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ ముందు ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి. అక్కడ అడిగిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆ ఫామ్‌ని ప్రింట్ తీసుకోండి.
Also read: