UPSC IFS Notification 2023: ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల

|

Feb 01, 2023 | 8:35 PM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. 150 ఐఎఫ్‌ఎస్‌ ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

UPSC IFS Notification 2023: ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల
UPSC IFS Prelims Exam 2023
Follow us on

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. 150 ఐఎఫ్‌ఎస్‌ ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులను సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2023 ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి యానిమల్ హస్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్/బోటనీ/కెమిస్ట్రీ/జియాలజీ/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/స్టాటిస్టిక్స్/జువాలజీ/అగ్రికల్చర్/ఫారెస్ట్రీ/ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2023 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 21, 2023వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్‌), పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 28న నిర్వహిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

పరీక్ష విధానం..

ప్రిలిమినరీ రాత పరీక్షలో రెండు పేపర్లకు.. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్‌ మాత్రమే. ఈ రెండు పేపర్లకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే మెయిన్స్‌ రాయడానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.