TSRDC CET 2024 Exam Date: తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీ ప్రవేశ పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. ఏ రోజునంటే

|

Mar 25, 2024 | 6:33 AM

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎస్సీ / ఎస్టీ / బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్‌ 28వ తేదీన టీఎస్‌ఆర్డీసీ సెట్‌ - 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఏప్రిల్‌ 21 నుంచి పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు ఓ ప్రకటనలో తెలిపారు..

TSRDC CET 2024 Exam Date: తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీ ప్రవేశ పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. ఏ రోజునంటే
TSRDC CET 2024
Follow us on

హైదరాబాద్‌, మార్చి 25: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎస్సీ / ఎస్టీ / బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్‌ 28వ తేదీన టీఎస్‌ఆర్డీసీ సెట్‌ – 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఏప్రిల్‌ 21 నుంచి పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలు రాసిన అభ్యర్థులు ఏప్రిల్‌ 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా టీఎస్‌ఆర్డీసీ సెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు గడువు తేదీ ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 15 పురుషుల కాలేజీలు, 15 మహిళా కాలేజీలు ఉన్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీలో 26 మహిళా కాలేజీలు, ఎస్టీ గురుకుల సొసైటీలో 6 పురుషుల కాలేజీలు, 15 మహిళా కాలేజీలు ఉన్నాయి. టీఎస్‌ఆర్డీసీ సెట్‌ – 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

గేట్‌ 2024 కటాఫ్‌ మార్కులు ఇవే.. సబ్జెక్టుల వారీగా ఇక్కడ చెక్‌ చేసుకోండి

దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఐఐటీలు, ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2024) కటాఫ్‌ మార్కులు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు, సబ్జెక్టులు, కేటగిరీ వారీగా కటాఫ్‌ మార్కులను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. కాగా ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 పరీక్ష కేంద్రాల్లో గేట్‌ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 8 లక్షలకుపైగా విద్యార్ధులు ఈ పరీక్ష రాశారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థలో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. బెంగళూరు ఐఐఎస్సీ ఆధ్వర్యంలో ఈ ఏడాది గేట్ పరీక్ష నిర్వహణ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.