TSPSC Answer Key: డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల తుది కీ విడుదల చేసిన టీఎస్పీయస్సీ.. అక్టోబర్‌ 21 నుంచి

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన తుది ఆన్సర్‌ కీని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ ఏడాది మే 19వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహించారు. ప్రాథమిక కీ ని అదే నెల 27న విడుదల చేశారు. ఈ ప్రాథమిక ఆన్సర్‌ కీపై జూన్‌ 1 నుంచి 3 వరకు కమిషన్‌ అభ్యంతరాలు స్వీకరించింది. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా..

TSPSC Answer Key: డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల తుది కీ విడుదల చేసిన టీఎస్పీయస్సీ.. అక్టోబర్‌ 21 నుంచి
TSPSC Answer Key
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 25, 2023 | 4:16 PM

హైదరాబాద్‌, అక్టోబర్ 25: తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన తుది ఆన్సర్‌ కీని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ ఏడాది మే 19వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహించారు. ప్రాథమిక కీ ని అదే నెల 27న విడుదల చేశారు. ఈ ప్రాథమిక ఆన్సర్‌ కీపై జూన్‌ 1 నుంచి 3 వరకు కమిషన్‌ అభ్యంతరాలు స్వీకరించింది. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా తుది కీ రూపొందించగా.. దానికి కమిషన్‌ ఆమోదం తెలిపింది. తుది కీ, అభ్యర్థుల సమాధాన పత్రాలను అక్టోబర్‌ 21 నుంచి అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామని వివరించింది. తుది కీ పై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.

ఏపీలో 46 మందికి కారుణ్య నియామక ఉద్యోగాలు

గతేడాది సెప్టెంబరు 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకూ దాదాపు 244 మంది పోలీసులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మరణించిన పోలీసధికారుల కుటుంబాల్లో 186 మందికి కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. వీరిలో 46 మందికి ఉద్యోగాలిచ్చామన్నారు. మిగతా దరఖాస్తులను కూడా పరిశీలనలో ఉన్నాయన్నారు. అర్హతల మేరకు వారికి కూడా త్వరలోనే ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా పోలీసు ఆరోగ్య భద్రత పథకం ద్వారా గతేడాది 11,486 మంది పోలీసులకు చికిత్స అందించామన్నారు. అందుకోసం రూ.42.40 కోట్లు వెచ్చించామని ఆయన పేర్కొన్నారు. గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకూ భద్రతా పథకం కింద 316 మందికి గృహ రుణాలు ఇచ్చామన్నారు. రూ.98.85 కోట్ల మేర రుణాలు అందించినట్లు వెల్లడించారు.

212 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ అనుమతి

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలను గ్రూపు 2 కింద భర్తీచేసేందుకు అనుమతిస్తూ అక్టోబర్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సాధారణ పరిపాలన శాఖ, వ్యవసాయ, పశు సంవర్ధక, ఉన్నత విద్య, హోం, మున్సిపల్‌, ప్రణాళిక, ప్లానింగ్‌ వంటి తదితర శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో అత్యధికంగా ఏపీపీఎస్సీ కార్యాలయంలో 30 పోస్టులు, భూ పరిపాలన శాఖలో 31 పోస్టులు, పాఠశాల విద్యా శాఖకు చెందిన పరీక్షల విభాగంలో 20 పోస్టులు చొప్పున ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం కోసం క్లిక్‌ చేయండి.