NCERT పుస్తకాల్లో ఇండియా బదులు భారత్‌ అని రాయాలి.. ప్రాచీన చరిత్రకు బదులు క్లాసికల్‌ హిస్టరీ

NCERT పుస్తకాల్లో ఇండియా బదులు భారత్‌ అని రాయాలన్న నిర్ణయంపై రాజకీయ రగడ రాజుకుంది. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఈ కుట్ర చేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే NCERT నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. విపక్షాల ఇండియా కూటమి ఆవిర్భవించాక ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలు ఇలాంటి హడావుడి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు ఆర్జేడీ నేత మనోజ్‌ఝా. రాజ్యాంగాన్ని కూడా మార్చే కుట్ర జరుగుతోందన్నారు.

NCERT పుస్తకాల్లో ఇండియా బదులు భారత్‌ అని రాయాలి.. ప్రాచీన చరిత్రకు బదులు క్లాసికల్‌ హిస్టరీ
NCERT
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 25, 2023 | 8:46 PM

NCERT పుస్తకాల్లో దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్‌ అని పిలవాలని నిర్ణయించారు. విద్యావేత్తల కమిటీ ఏకగ్రీవ సిఫారసు ప్రకారం NCERT ప్రచురించే అన్ని పాఠ్యపుస్తకాల్లో ఇండియాకు బదులు భారత్‌ అని ప్రస్తావించాలని నిర్ణయించినట్లు కమిటీ చైర్మన్‌ CI ఇస్సాక్‌ చెప్పారు. అలాగే, ప్రాచీన చరిత్రకు బదులు క్లాసికల్‌ హిస్టరీని ప్రవేశపెట్టాలని సిఫారసు చేసినట్లు ఇస్సాక్‌ వివరించారు. అయితే NCERT నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. విపక్షాల ఇండియా కూటమి ఆవిర్భవించాక ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలు ఇలాంటి హడావుడి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు ఆర్జేడీ నేత మనోజ్‌ఝా. రాజ్యాంగాన్ని కూడా మార్చే కుట్ర జరుగుతోందన్నారు.

జులైలో విపక్షాల ఇండియా కటమి ఆవిర్భవించాక ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతల నుంచి ఇలాంటి రియాక్షన్‌ వస్తోంది. ఇండియా కూటమిని టార్గెట్‌ చేయడమే వాళ్ల లక్ష్యం. ఇది చాలా హడావుడిగా తీసుకున్న నిర్ణయం. ఆర్టికల్‌ 1ను ఏం చేస్తారు . ఇండియా అంటే భారత్‌ అని అందులో రాసి ఉంది. దానిని కూడా మారుస్తారా ? చరిత్రను వక్రీకరిస్తున్నారు.

అన్ని సబ్జెక్టుల సిలబస్‌లో..

అన్ని సబ్జెక్టుల సిలబస్‌లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ప్రవేశపెట్టాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. అయితే.. ఈ కమిటీ చేసిన సిఫార్సులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు తెలిపారు. ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్‌సీఈఆర్‌టీ ఛైర్మన్ దినేష్ సక్లానీ స్పష్టంచేశారు.

‘జాతీయ విద్యావిధానం 2020’కి అనుగుణంగా NCERT . స్కూలు పుస్తకాల పాఠ్యాంశాలను సవరిస్తోంది. పాఠ్యాంశాలు, పుస్తకాలు, అభ్యాస సామగ్రిని ఖరారు చేయడానికి కౌన్సిల్ ఇటీవల 19 మంది సభ్యులతో ‘నేషనల్ సిలబస్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ (NSTC)’ని ఏర్పాటు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి