TSPSC Recruitment 2022: తెలంగాణ బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్! 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌..

|

Sep 04, 2022 | 2:54 PM

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్‌ సర్వీసుల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..

TSPSC Recruitment 2022: తెలంగాణ బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్! 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌..
Tspsc Aee
Follow us on

TSPSC AEE Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్‌ సర్వీసుల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత (సివిల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్ తదితర) విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 44 యేళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్‌ 15, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు సెప్టెంబర్‌ 22, 2022 నుంచి ప్రారంభమవుతాయి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.54,220ల నుంచి రూ.1,33,630ల వరకు జీతంగా చెల్లిస్తారు. వివరణాత్మక నోటిఫికేషన్‌ ఈ నెల 15వ తేదీన కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఖాళీల వివరాలు:

  • ఏఈఈ(సివిల్)- పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ డిపార్ట్‌మెంట్‌ (మిషన్ భగీరథ) పోస్టులు: 302
  • ఏఈఈ(సివిల్)- పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ డిపార్ట్‌మెంట్‌ పోస్టులు: 211
  • ఏఈఈ (సివిల్) ఎంఏ అండ్‌ యూడీ- పీహెచ్‌ పోస్టులు: 147
  • ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్‌ పోస్టులు: 15
  • ఏఈఈ ఐ అండ్‌ సీఏడీ డిపార్ట్‌మెంట్‌ పోస్టులు: 704
  • ఏఈఈ (మెకానికల్) ఐ అండ్‌ సీఏడీ(జీడబ్ల్యూడీ) పోస్టులు: 3
  • ఏఈఈ (సివిల్) టీఆర్‌ అండ్‌ బి పోస్టులు: 145
  • ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్‌ అండ్‌ బి పోస్టులు: 13

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.