TSPSC paper leak case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో అరెస్ట్.. లాగేకొద్దీ కదులుతోన్న డొంకలు!

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తాజాగా మరొకరు అరెస్ట్‌ అయ్యారు. న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తిని నగర సీసీఎస్‌/సిట్‌ పోలీసులు శనివారం (నవంబర్‌ 4) అరెస్ట్‌ చేశారు. దీంతో ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 100 మందికి పైకి చేరింది. సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన వారిలో అధిక మంది విద్యార్ధులే ఉండటం విశేషం. వీరందరిపై ఐపీసీలోని 381, 409, 420, 411, 120 (బీ), 201తో పాటు ఐటీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద..

TSPSC paper leak case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో అరెస్ట్.. లాగేకొద్దీ కదులుతోన్న డొంకలు!
TSPSC paper leak case
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 05, 2023 | 7:08 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 5: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తాజాగా మరొకరు అరెస్ట్‌ అయ్యారు. న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తిని నగర సీసీఎస్‌/సిట్‌ పోలీసులు శనివారం (నవంబర్‌ 4) అరెస్ట్‌ చేశారు. దీంతో ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 100 మందికి పైకి చేరింది. సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన వారిలో అధిక మంది విద్యార్ధులే ఉండటం విశేషం. వీరందరిపై ఐపీసీలోని 381, 409, 420, 411, 120 (బీ), 201తో పాటు ఐటీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద సిట్ ఆధికారులు కేసులు నమోదు చేశారు.

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ కార్యాలయంలో నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేస్తున్న తన బావమరిది సాన ప్రశాంత్‌ (31)కు కూడా ప్రశ్నాపత్రం చేరవేశాడు. గ్రూప్‌1 ప్రశ్నపత్రం చేరవేసిన తర్వాత అతను పరిక్షకు సిద్ధం అయ్యి పరీక్ష కూడా రాశాడు. రెండు రోజుల క్రితం నిందితుడు ప్రశాంత్‌ న్యూజిలాండ్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాడు. సమాచారం అందుకున్న సిట్‌ పోలీసులు విమానాశ్రయంలోనే అతన్ని అరెస్ట్‌ చేసి శనివారం కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం రిమాండ్‌ విధించటంతో చంచల్‌గూడ జైలుకు నిందితుడిని తరలించినట్లు అధికారులు మీడియాకు తెలిపారు.

కాగా తెలంగాణలో సంచలం సృష్టించిన ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డిలను కీలక నిందితులుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించిన సంగతి తెలిసిందే. వీరు ప్రశ్నాపత్రాలను పలువురు అభ్యర్థులకు అమ్మి, వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన అభ్యర్థులు, దళారులను గుర్తించిన అధికారులు వారందరినీ అరెస్ట్‌ చేసి కటకటాల వెనుక వేశారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు కూడా సిట్‌ పోలీసులు నోటీసులు పంపారు. అయితే అతని నుంచి సరైన సమాధానం రాకపోవటంతో లుక్‌ ఔట్‌ నోటీసులు (ఎల్‌వోసీ) జారీ చేశారు. దీంతో అతను తాజాగా రాష్ట్రానికి రావడంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రధాన నిందితుడు రమేష్ ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన సమారు 25 ప్రశ్నపత్రాలను పలువురికి విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ ద్వారా డీఈ రమేష్ సమాధానాలు అందించినట్లు దర్యాప్తులో అధికారులు వెల్లడించారు. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డి గ్రూప్‌ 1తో సహా పలు ప్రశ్నాపత్రాలను లీక్‌ చేయడంతో చీమల పుట్ట మాదిరి దర్యాప్తు చేసే కొద్ది నిందితుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి